నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి, తెలుగు రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిరకాలం మన మనసులలో మిగిలిపోతారు- చిరంజీవి
నూటికో కోటికో ఒక్కరు, వందేళ్లు కాదు, చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు ఎన్టీఆర్ అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెప్తుందన్నారు. కారణ జన్ముడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు జాతికి ఘన కీర్తి తీసుకొచ్చిన రామారావుతో అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం అన్నారు.
తాతను గుర్తు చేసుకున్న జూ. ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఆ మహనీయుడిని గుర్తు చేసుకున్నారు. “మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా“ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
తెలుగు జాతికి గర్వం- కల్యాణ్ రామ్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్ ఆయనను స్మరించుకున్నారు. “మీరే మా దైవం, మీరే మా సర్వం, తెలుగు జాతికి మీరు గర్వం. జోహార్ NTR” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నటుడిగా ఇప్పటికీ ఆయనంటే నాకు భయం. ఇప్పటికీ చాలా మంది నటీనటులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘దాన వీర శూర కర్ణ’ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఆయన ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం ఎప్పటికీ మర్చిపోలేం. నేటి సాంకేతికతలో మీ నటనకు సరితూగడం నిజంగా కష్టం. అతడి నటనా నైపుణ్యంతో మిలియన్ల మందిని, ఎన్నో తరాలను అలరించడానికి, అతడి సినిమాల ద్వారా శాశ్వతంగా భూమ్మీద జీవించడానికి దేవతులు పంపింన మహనీయుడు ఆయన” అన్నారు మంచు విష్ణు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు సాయి ధరమ్ తేజ్ ఆయనను గుర్తు చేసుకున్నారు. “భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక నటుడిగా, నాయకుడిగా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఆ 'లెజెండ్'కి నివాళులు” అని ట్వీట్ చేశారు.
దర్శకుడు శ్రీను వైట్ల ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. గ్రేటెస్ట లెజెంట్ కు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్ చరిష్మా, ఆయన అందుకున్న విజయాలు తర తరాల నటులకు స్పూర్తిదాయకం అన్నారు దర్శకుడు బాబీ. 100వ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావుకు ఆయన సెల్యూట్ చేశారు.
Read Also: ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు, ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే- విజయశాంతి