NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

'దేవర' సినిమా చిత్రీకరణకు ఎన్టీఆర్ చిన్న విరామం ఇచ్చారు. మళ్ళీ ఆయన ఎప్పుడు సెట్స్‌కు ఎప్పుడు వస్తారంటే?

Continues below advertisement

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'దేవర' (Devara Pan India Movie). 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని రోజులు ఏకధాటిగా చిత్రీకరణ చేశారు. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా సినిమా చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చారు ఎన్టీఆర్! ఇంకో వారం 'దేవర'కు విశ్రాంతి అని తెలిసింది. మరి, నెక్స్ట్ షెడ్యూల్? అంటే... 

Continues below advertisement

జూన్ 5 నుంచి 'దేవర' కొత్త షెడ్యూల్!
అవును... జూన్ 5వ తేదీ నుంచి 'దేవర' కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణం అంతా ఇందులో పాల్గొంటారని తెలిసింది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంటోంది.

'దేవర'లో 'కెజిఎఫ్' నటుడు తారక్ పొన్నప్ప!
కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన 'కెజిఎఫ్' సినిమా గుర్తు ఉందా? అందులో మాఫియా డాన్స్ బాస్ శెట్టి ఆండ్రూ సెక్రటరీ పాత్ర చేసిన తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) గుర్తు ఉన్నారా? . తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన 'సిఎస్ఐ సనాతన్' సినిమాలో కూడా ఆయన నటించారు. అతను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.

Also Read : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!

'దేవర'లో తారక్ పొన్నప్ప క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ జరిగిన షూటింగులో ఆయన పాల్గొన్నారట. వచ్చే నెలలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో సైతం పాల్గొంటారట.

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై 'దేవర' సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. 
    
పవర్ ఫుల్ యాక్షన్!
ఎన్టీఆర్ అంటే యాక్షన్! సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం ధీటైన యాక్షన్ ప్లాన్ చేశారట.

Also Read 'ఇండియా హౌస్' హిస్టరీ తెలుసా? సావర్కర్ కథను రామ్ చరణ్ ఎందుకు తీసుకున్నాడంటే?

'దేవర' సినిమాలో మరో కన్నడ యాక్టర్ ఉన్నారు. ఆవిడ పేరు చైత్రా రాయ్! 'అష్టా చమ్మా', 'దటీజ్ మహాలక్ష్మి', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు' సీరియళ్లతో సందడి చేశారు. ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'రాధకు నీవేరా ప్రాణం'లో నటిస్తున్నారు. 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో ఆమె నటిస్తున్నారు.  

Continues below advertisement