డబుల్ ఇస్మార్ట్ టీజర్ - డబుల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి, రామ్ & పూరి కుమ్మేశారుగా!
ఇస్మార్ట్ శంకర్... ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుకు గుర్తుకు వచ్చేది డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన మాసీ క్యారెక్టర్! ఆ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని నటన! హైదరాబాదీ యువకుడి పాత్రలో రామ్ ఇరగదీశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఈ రోజు రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


స్టార్ హీరోతో దర్శకుడికి గొడవ - డైరెక్టుగా ఆన్‌లైన్‌లో మూవీ రిలీజ్, ఇంతకీ ఏం జరిగిందంటే?
మలయాళీ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘వళక్కు’ మూవీ విషయంలో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరోతో గొడవల కారణంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాదని భావించిన ఆయన, నేరుగా ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చంటూ లింక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘విద్య వాసుల అహం’ ట్రైలర్ విడుదల - భార్యాభర్తల గొడవలు, రొమాన్స్, ఇంకా చాలా!
హీరో, హీరోయిన్‌కు పెళ్లి అవ్వడం, ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య గొడవలు మొదలవ్వడం.. ఈ కాన్సెప్ట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సినిమాలు హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మరో చిత్రమే ‘విద్య వాసుల అహం’. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకోగా.. తాజాగా దీని ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు మేకర్స్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహాలో విడుదల కానుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్ ద్వారా సినిమాలోని అసలు కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు మణికాంత్ గెల్లి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రెండు వారాల పాటు తెలంగాణలో థియేటర్లు బంద్ - అసలు కారణం అదేనా?
చాలారోజులుగా థియేటర్లలో సినిమా సందడి లేదు. కొత్త సినిమాలు ఏవీ విడుదల కాగా.. విడుదల అయినవి ప్రేక్షకులను మెప్పించలేక థియేటర్లు పూర్తిగా డల్ అయిపోయాయి. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు ఆపేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకపోవడంతో, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తుందని థియేటర్ల ఓనర్లు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా థియేటర్లలో ఆక్యుపెన్సీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు వాపోయారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ హీరో - 'చందు ఛాంపియన్'లో కార్తీక్ ఆర్యన్‌ను చూశారా?
హిందీ సినిమా 'చందు ఛాంపియన్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయిజాన్' వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన కబీర్ ఖాన్ దర్శకుడు. ఫస్ట్ లుక్ చూసి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా అని ఈజీగా చెప్పవచ్చు. ఇండియా నుంచి Paralympics, 1972లో గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ఇది. ఈ సినిమాలో హీరో కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఆయన ఒకరు. 'ప్యార్ కా పంచనామా' కావచ్చు, 'సోను కె టిటు కి స్వీటీ' కావచ్చు, 'లూకా చుప్పి', 'పతి పత్ని ఔర్ ఓ' వగైరా వగైరా కావచ్చు. ప్రతి సినిమాలో కార్తీక్ ఆర్యన్ ఈతరం కుర్రాళ్లకు ప్రతినిధి అన్నట్టుగా హ్యాండ్సమ్ హీరోగా కనిపించారు. కానీ, ఈ 'చందు ఛాంపియన్' కోసం లుక్ పూర్తిగా మార్చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)