ఇస్మార్ట్ శంకర్... ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుకు గుర్తుకు వచ్చేది డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath Director) క్రియేట్ చేసిన మాసీ క్యారెక్టర్! ఆ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటన! హైదరాబాదీ యువకుడి పాత్రలో రామ్ ఇరగదీశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఈ రోజు రామ్ పోతినేని బర్త్ డే (Ram Pothineni Birthday) సందర్భంగా ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
డబల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి!
'డబుల్ ఇస్మార్ట్' ప్రేక్షకులకు డబల్ ఇంపాక్ట్ ఇస్తుందని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. ఇవాళ ఐదు భాషల్లో విడుదలైన టీజర్ చూస్తే డబుల్ మాస్ అని చెప్పాలి. దిమాకిక్కిరికిరి అంటూ రామ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఇరగదీశారు. ఆ టీజర్ మీరూ చూడండి.
Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
ముంబైలో జరుగుతున్న షూటింగ్!
Double iSmart Shooting Update: 'ఇస్మార్ట్ శంకర్' ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. రామ్ పోతినేని సహా ప్రముఖ తారాగణం అంతా అందులో పాల్గొంటుంది. ''ఈ సినిమాతోప్రేక్షకులకు డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ'' అని యూనిట్ చెబుతోంది
పాన్ ఇండియా లెవెల్ రిలీజ్!
'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యింది. యూట్యూబ్, ఓటీటీ వేదికల్లో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read: అనన్యా పాండే నోటిలో ఉన్నది సిగరెట్ అనుకున్నారా? అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
'డబుల్ ఇస్మార్ట్'ను పూరీ కనెక్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ అయ్యారు.
'ఇస్మార్ట్ శంకర్'తో పాటు అంతకు ముందు 'పోకిరి', 'చిరుత' సహా కొన్ని సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ 'డబుల్ ఇస్మార్ట్'కు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శామ్ కె నాయుడు - జియాని జియానెలీ, స్టంట్ డైరెక్టర్లు: కేచ - 'రియల్' సతీష్.