Andhra Pradesh News  Today: ఏపీలో మొత్తం ఓటింగ్ శాతం 81.86- పాత రికార్డులు పక్కకు జరిగాయి
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈవీఎంలు బద్దలయ్యేలా ఓట్లు పడ్డాయి. ఉప్పెనలా కదిలి వచ్చిన ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసిన వారి శాతం 80.66 శాతంగా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వేసిన బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. ఇది 1.20 శాతం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు
దాడులు, ప్రతిదాడులతో పల్నాడు(Palnadu) జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా...పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా...రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టాలీవుడ్ స్టార్ హీరోస్‌కి ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?
బాధ్యత ఉండక్కర్లా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మూవీలో కోప్పడతాడు. ఆ సీన్ వైరల్ అయ్యింది. ప్రజలకే కాదు, స్టార్ హీరోలకూ బాధ్యత వుండాలి. ఎన్నికల వంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పనిసరిగా ఓటు వెయ్యాలి. బాధ్యత లేకుండా ఓటు వెయ్యని స్టార్ హీరో బద్ధకం ఫిలిం ఇండస్ట్రీలో, జనాల్లో చర్చకు దారి తీసింది. ఎంత హీరో అయితే మాత్రం ఓటు వేయడానికి అతడికి అంత బద్ధకం ఏమిటని నలుగురూ నానా మాటలు అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


జూన్‌ 4 వరకు ఏం చేయలేం- చేతులెత్తిసిన పోలీసులు: నాని భార్య సంచలన ఆరోపణలు
పద్మావతి యూనివర్శిటీలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కాక రేపుతోంది. గంటలో నిందితులను అరెస్టు చేస్తామన్న ఎస్పీ ఇప్పుడు చేతులు ఎత్తేశారని నాని భార్య సుధారెడ్డి ఆరోపించారు. నాల్గో తేదీ వరకు ఓపిక పట్టాలని తమకు సలహా ఇస్తున్నారని అన్నారు. తమ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసనని... పోలీసులకే చంద్రగిరిలో రక్షణ లేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇదేనా రాహుల్‌ మీ ప్రేమ దుకాణం? అచ్చంపేటలో బీఆర్‌ఎస్ నేత ఇంటి దాడిపై కేటీఆర్‌ సీరియస్‌
తెలంగాణలో పోలింగ్ అనంతరం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో గొడవలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ లీడర్‌ ప్రవీణ్‌కుమార్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో షేర్ చేసి పోలీసుల తీరును, ప్రభుత్వం పని తీరును ప్రశ్నించారు. దీన్ని రీ ట్వీట్ చేసిన మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఇదేనా మీ ప్రేమ దుకాణం అంటూ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి