Tirupati Polling Violence: పద్మావతి యూనివర్శిటీలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కాక రేపుతోంది. గంటలో నిందితులను అరెస్టు చేస్తామన్న ఎస్పీ ఇప్పుడు చేతులు ఎత్తేశారని నాని భార్య సుధారెడ్డి ఆరోపించారు. నాల్గో తేదీ వరకు ఓపిక పట్టాలని తమకు సలహా ఇస్తున్నారని అన్నారు. తమ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసనని... పోలీసులకే చంద్రగిరిలో రక్షణ లేదని అన్నారు.
సాక్ష్యాధారాలు ఇచ్చినా నానిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయలేకపోయిన పోలీసులు ప్రివెంటివ్ అరెస్టు పేరుతో తమ వారిని అరెస్టు చేశారని సుధారెడ్డి వాపోయారు. వారి అరెస్టును నిరసిస్తూ తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమ వారిని విడిచిపెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నా వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసులుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
" మమ్మల్ని మేం ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. పోలీసులపై దాడి చేసినా పట్టించుకోవడం లేదు. నాల్గో తేదీ వరకు ఏం చేయలేమని గులాంగిరి చేస్తామని ఎస్పీ చెబుతున్నారు. నాల్గో తేదీ తర్వాత చెవిరెడ్డి పని పడతానని చెబుతున్నారు. నాల్గో తేదీ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ముందు మీ వాళ్లపై జరుగుతున్న దాడులను ఆపండి." అని సుధారెడ్డి ఫైర్ అయ్యారు.
"ఒక సెకన్ లేట్ అయినా, సెక్యూరిటీ ధరణి లేకపోయినా నాని ప్రాణాలతో దక్కేవాళ్లు కాదు. చిన్న పిల్లాడిని కాపాడినట్టు నానిని కాపాడారు. వైసీపీ వాళ్లు దాడి చేసిన ఆధారాలు పోలీసులకు ఇచ్చాం. ఎస్పీ నిన్న డైలాగ్ కొట్టారు. గంట, ఐదు గంటలు, రోజు గడిచినా ఇంత వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. మా వాళ్లను ప్రివెంటివ్ అరెస్టు అని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. దానికి వ్యతిరేకంగా మేం ఇక్కడ వచ్చి కూర్చుమ్నాం. "
"నాల్గో తేదీ వరకు ఎస్పీకి బయమంటా ఎవర్నీ టచ్ చేయలేడంటా నాల్గో తేదీ తర్వాత చెవిరెడ్డిని కొడతాడంతా అప్పటి వరకు మేం కామ్‌గా ఉండాలని చెబుతున్నారు. చెవిరెడ్డిని కొడతావో చంపుకుంటావో నీ ఇష్టం కానీ మాకు మాత్రం న్యాయం కావాలి. ఆధారాలు ఇచ్చాం. అరెస్టు చెయ్. దాడి చేసిన వారి వీడియో ఫుటేజ్ ఇస్తే ఒక్కడ్ని కూడా అరెస్టు చేయలేదు. "
ఇన్న ఆధారాలు ఇచ్చినా వారిని అరెస్టు చేయకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు. ఎస్పీ గారిని కూడా రేపు కొడతారు. మేం వచ్చి కాపాడుకుంటాం. భయం అంటున్నారు. మీకు మీ ఫ్యామిలీకి ఆపద ఉంది అని చెబితే మేం కాపాడుకుంటాం. " అని సుధారెడ్డి పోలీసులపై విమర్శలు చేశారు.