Kartik Aaryan In Chandu Champion: హిందీ సినిమా 'చందు ఛాంపియన్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా 'ఏక్ థా టైగర్', 'భజరంగీ భాయిజాన్' వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన కబీర్ ఖాన్ దర్శకుడు. ఫస్ట్ లుక్ చూసి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా అని ఈజీగా చెప్పవచ్చు. ఇండియా నుంచి Paralympics, 1972లో గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ఇది. మరి, లుక్కులో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా?


గుర్తుపట్టలేనంతగా కార్తీక్ ఆర్యన్!
'చందు ఛాంపియన్' సినిమాలో హీరో కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో ఆయన ఒకరు. 'ప్యార్ కా పంచనామా' కావచ్చు, 'సోను కె టిటు కి స్వీటీ' కావచ్చు, 'లూకా చుప్పి', 'పతి పత్ని ఔర్ ఓ' వగైరా వగైరా కావచ్చు. ప్రతి సినిమాలో కార్తీక్ ఆర్యన్ ఈతరం కుర్రాళ్లకు ప్రతినిధి అన్నట్టుగా హ్యాండ్సమ్ హీరోగా కనిపించారు. కానీ, ఈ 'చందు ఛాంపియన్' కోసం లుక్ పూర్తిగా మార్చేశారు. ఎంత మార్చారు? అంటే... ఆయన్ను గుర్తు పట్టలేనంతగా!


Also Read: తమ్ముడొస్తే అన్న రాలేదు, అన్నొస్తే తమ్ముడు రాలేదు, ప్రచారం చేసి ఓటు వెయ్యలేదు... టాలీవుడ్ స్టార్ హీరోస్‌కి ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?


రెగ్యులర్ సినిమాల్లో కార్తీక్ ఆర్యన్ లుక్స్, 'చందు ఛాంపియన్'లో లుక్ గమనిస్తే... ఎంతో మార్పు కనిపిస్తుంది. తన ఫిల్మోగ్రఫీలో ఇదొక డిఫరెంట్ లుక్ & సినిమా అవుతుందని కార్తీక్ ఆర్యన్ కంప్లీట్ మేకోవర్ అయ్యారు. సిక్స్‌ ప్యాక్‌ చేశారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకాస్త సన్నబడ్డారు. ''హీరోగా నా ప్రయాణంలో ఛాలెంజింగ్ & స్పెషల్ సినిమా ఇది'' అని ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ పేర్కొన్నారు. ఛాంపియన్ వస్తున్నాడని చెప్పారు.






థియేటర్లలోకి జూన్ 14న సినిమా!
Chandu Champion Release Date: థియేటర్లలో జూన్ 14న 'చందు ఛాంపియన్' సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇండియన్ క్రికెట్ టీం 1983లో వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఘట్టాలను '83'గా తీసిన కబీర్ ఖాన్, ఆ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ 'చందు ఛాంపియన్'. థియేటర్లలో '83'కి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ఏమీ రాలేదు. 'చందు ఛాంపియన్'తో ఆ ఫ్లాప్ మర్చిపోయేలా చేయాలి కబీర్ ఖాన్.


Also Read: సింగర్ జోనితా గాంధీ పాటలే కాదు... ఫోటోలు కూడా చాలా స్పైసీ గురూ


'చందు ఛాంపియన్' సినిమాను నడియాడ్ ద్వలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాజిద్ నడియాడ్ వాలా ప్రొడ్యూస్ చేస్తున్నారు. భువన్ అరోరా, పాలక్ లల్వాని, ఆడోనిస్ క్యాప్సలిస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు. జూలియస్ పేకియం నేపథ్య సంగీతం అందించనున్నారు.