'మను చరిత్ర' రివ్యూ : 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి'లా ఉందా? శివ కందుకూరి ఎలా చేశారు?


'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' వంటి న్యూ ఏజ్ సినిమాలను రాజ్ కందుకూరి ప్రొడ్యూస్ చేశారు. ఆయన తనయుడు శివ కందుకూరి 'చూసి చూడంగానే'తో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత 'గమనం'లో ఓ హీరోగా చేశారు. ఆయన నటించిన తాజా సినిమా 'మను చరిత్ర' (Manu Charitra Movie). ప్రీ రిలీజ్ వేడుకలో ప్రచార చిత్రాలు చూస్తే 'ఆర్ఎక్స్ 100' వైబ్స్ కనపడుతున్నాయని హీరో కార్తికేయ అన్నారు. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


బోయపాటి - రామ్ మూవీ రిలీజ్ డేట్ మారిందండోయ్ - ముందే వచ్చేస్తారట!


రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ సినిమా  దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.  ‘ది వారియర్’ తర్వాత రామ్, ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.   (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’ సినిమా - కోర్టును ఆశ్రయించిన నరేష్ భార్య రమ్య రఘుపతి!


టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా లొల్లి మళ్లీ మొదలైంది. ఈ సినిమాను జూన్ 23 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. ఈ నేపథ్యం లో మూవీ స్ట్రీమింగ్ ను నిలిపి వేయాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా నిజ జీవితాలను పోలి ఉందని, ఈ మూవీతో సమాజంలో తన ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కింది రమ్య. గతంలో కూడా సినిమా విడుదల సందర్భంగా కూడా ఇలాగే సినిమాను నిలిపివేయాలంటూ డిమాండ్ చేసింది. మళ్లీ మరోసారి ఓటీటీలో కూడా మూవీను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ రివ్యూ: అవికా గోర్ హార్రర్ సినిమా ఎలా ఉంది?


హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘1920 సిరీస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2008లో వచ్చిన మొదటి ‘1920’ సినిమా నుంచి 2018లో వచ్చిన నాలుగో సినిమా ‘1921’ వరకు నాలుగు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయి. దీంతో ఐదో సినిమాగా ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ పేరిట ఐదో సినిమాను తెరకెక్కించారు. తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న అవికా గోర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. హిందీలో తీయడంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేశారు. టీజర్, ట్రైలర్ కూడా ఆ జానర్‌ను ఇష్టపడేవారిని ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువంటూ అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కూడా ఈ సినిమా ప్రమోషన్లలోనే. మరి సినిమా ఎలా ఉంది?  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఆస్పత్రి నుంచి ఈ రోజే ఉపాసన డిశ్చార్జ్ - రామ్ చరణ్‌తో కలిసి మీడియా ముందుకు!


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ వారం (జూన్ 20వ తేదీ, మంగళవారం) పండంటి ఆడబిడ్డకు కొణిదెల వారి కోడలు జన్మ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారామె. మరి, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఇంటికి ఎప్పుడు వెళతారు? అంటే... 'ఈ రోజు' అని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)