సినిమా రివ్యూ : మను చరిత్ర
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివ కందుకూరి, ధనుంజయ్, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాత్సవ్, ప్రియా వడ్లమాని, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, హర్షితా చౌదరి, మధునందన్ తదితరులు
ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్!
సంగీతం : గోపీసుందర్
నిర్మాత : ఎన్. శ్రీనివాస రెడ్డి
రచన, దర్శకత్వం : భరత్ పెదగాని
విడుదల తేదీ: జూన్ 23, 2023
'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' వంటి న్యూ ఏజ్ సినిమాలను రాజ్ కందుకూరి ప్రొడ్యూస్ చేశారు. ఆయన తనయుడు శివ కందుకూరి 'చూసి చూడంగానే'తో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత 'గమనం'లో ఓ హీరోగా చేశారు. ఆయన నటించిన తాజా సినిమా 'మను చరిత్ర' (Manu Charitra Movie). ప్రీ రిలీజ్ వేడుకలో ప్రచార చిత్రాలు చూస్తే 'ఆర్ఎక్స్ 100' వైబ్స్ కనపడుతున్నాయని హీరో కార్తికేయ అన్నారు. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Manu Charitra Movie Story) : మను దుర్గరాజు (శివ కందుకూరి) వరంగల్ కుర్రాడు. శ్రావ్య (ప్రియా వడ్లమాని)ని ప్రేమిస్తాడు. ఆమె కోసం వాళ్ళ అన్నయ్య చేత తన్నులు తింటాడు. శ్రావ్య ప్రేమలో పడి దగ్గరయ్యే సరికి బ్రేకప్ చెబుతాడు. ఆ తర్వాత కొంత మంది అమ్మాయిలతో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రేమించిన కొన్నాళ్ళకు ఎందుకు బ్రేకప్ చెబుతున్నాడు? గతంలో జెన్నిఫర్ (మేఘా ఆకాష్)తో ప్రేమకథ అతడికి ఎటువంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది? జాను (ప్రగతి శ్రీవాత్సవ్) రాకతో మను జీవితంలో ఏం జరిగింది? వరంగల్ మేయర్ జనార్దన్ (శ్రీకాంత్ అయ్యంగార్)తో పాటు మరికొందరి హత్యలకు, మనుకు సంబంధం ఏమిటి? పోలీసులు అతడి వెంట ఎందుకు పడుతున్నారు? రౌడీ రుద్ర ప్రతాప్ (ధనుంజయ్) దగ్గర మను ఎందుకు పని చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Manu Charitra Movie Review) : తెలుగులో ప్రేమకథలు చాలా వచ్చాయి. అయితే... 'ప్రేమ చేసిన గాయానికి మందు ప్రేమ మాత్రమే' అని చెప్పే సినిమా 'మను చరిత్ర'. పాయింట్ పరంగా కాస్త కొత్తగా ఉంది. అయితే... దానిని చెప్పిన తీరు పాతగా ఉంది. 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనపడతాయి. మ్యాగ్జిమమ్ శివ కందుకూరి నటన కొత్తగా ఫీలయ్యేలా చేసింది.
ఒక కొత్త పాయింట్ తీసుకుని కమర్షియల్ సినిమాగా 'మను చరిత్ర'ను మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు భరత్! ఒకానొక సమయంలో అసలు పాయింట్ నుంచి పక్కకి వెళ్ళి ప్రేమకథకు రొటీన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో లెంగ్త్ చాలా ఎక్కువ అయ్యింది. సినిమాలోకి బోరింగ్ మూమెంట్స్ వచ్చాయి. ఈజీగా అరగంట నిడివి తగ్గిస్తే సినిమా మరింత క్రిస్పీగా అయ్యి బావుండేది.
'మను చరిత్ర'లో స్క్రీన్ మీద హీరో శివ కందుకూరి అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో సంగీత దర్శకుడు గోపీసుందర్. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. యాక్షన్ సీన్లకు ఇచ్చిన ఆర్ఆర్ బావుంది. ఇటు యాక్షన్, అటు లవ్... రెండిటినీ బ్యాలన్స్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమా ఆసక్తికరంగా మొదలైంది. కాసేపటికి రొటీన్ ఫార్మటులోకి వెళ్ళింది. సెకండాఫ్ మళ్ళీ ఆసక్తిగా సాగింది. నిదానంగా సాగడంతో ముగింపు కోసం ఎదురు చూసేలా దర్శకుడు తీశాడు.
నటీనటులు ఎలా చేశారు? : హీరోగా కెరీర్ తొలినాళ్ళలో శివ కందుకూరికి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్ దక్కింది. రెండు లుక్స్‌లో కనిపించారు. గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్ ఆయనకు సూట్ అయ్యింది. 'ఆర్ఎక్స్ 100', 'అర్జున్ రెడ్డి' తరహాలో ఇంటెన్స్ యాక్టింగ్ చేశారు. ఫ్లాష్‌బ్యాక్ ప్రేమకథలో క్యూట్ లుక్ కూడా ఓకే. అయితే... సీరియస్, యాక్షన్ క్యారెక్టర్లకు శివ కందుకూరి సూట్ అవుతారని 'మను చరిత్ర' ప్రూవ్ చేసింది.
హీరోయిన్లు అందరిలో మేఘా ఆకాష్ (Megha Akash)కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కింది. జెన్నీ పాత్రలో ఆమె నటన ఓకే. అయితే... జానుగా ప్రగతి శ్రీవాత్సవ్ ఆకట్టుకుంటారు. ప్రియా వడ్లమాని, హర్షితా చౌదరి పాత్రల నిడివి పరిమితమే. మేయర్ జనార్ధన్ పాత్రకు శ్రీకాంత్ అయ్యంగార్, రుద్ర ప్రతాప్ పాత్రకు ధనుంజయ్ న్యాయం చేశారు. పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో స్నేహితునిగా సుహాస్ ఓకే.
Also Read : 'అశ్విన్స్' రివ్యూ : 'విరూపాక్ష'లా భయపెడుతుందా? SVCCకి మరో హిట్ వస్తుందా?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'మను చరిత్ర'లో తీసుకున్న పాయింట్ కొత్తది. కానీ, ట్రీట్మెంట్ రొటీన్‌గా ఉంది. గోపీసుందర్ సంగీతం బావుంది. హీరో శివ కందుకూరిని నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఇంటెన్స్, యాక్షన్ క్యారెక్టర్లకు కూడా శివ సూట్ అవుతారు.
Also Read : 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?