సినిమా హీరోగా రాణిస్తూనే, రాజకీయాల్లోనూ యాక్టివ్ గా కొనసాగుతున్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే రాజకీయ యాత్రలు మొదలు పెట్టారు. వారాహిపై ఊరూరా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మంచి స్థానాలు గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరోసారి టార్గెట్ చేశాడు. ఆయన తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారంటూ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు.
పవన్ కల్యాణ్ పై మరోసారి రెచ్చిపోయిన ఉమైర సంధు
టాలీవుడ్ లో యంగ్ హీరోలు సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంటే పవన్ కల్యాణ్ మాత్రం తన మార్కెట్ పొజిషన్ కోల్పోతున్నారని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. “పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారు. టాలీవుడ్ లో తన మార్కెట్ పొజిషన్ కోల్పోతున్నారు. అతనికి సరైన సినిమాలు రావడం లేదు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూఎన్టీఆర్ పాన్ ఇండియా సక్సెస్ పట్ల ఆయన చాలా అసూయతో ఉన్నారు. అంతేకాదు, తీవ్రమైన టెన్షన్‌లో ఉన్నారు. ఆల్కహాల్ కు బానిస అయ్యారు” అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.
గతంలోనూ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు
గతంలోనూ ఉమరై సంధు పవన్ కల్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘డై హార్డ్ ఉమనైజర్’గా ఆయనను అభివర్ణించాడు. అప్పట్లో ఈ ట్వీట్ సంచలనం కలిగించింది. పవన్ కల్యాన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. “ పవన్ కల్యాణ్ డైహార్డ్ ఉమనైజర్. అతను 2 సార్లు విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికీ అతడు చాలా మంది హీరోయిన్లతో హ్యాంగ్ అవుట్ చేస్తున్నాడు. అతను చాలా మంది టాప్ నటీమణులతో..” అని ట్వీట్ చేశాడు. ఉమైర్ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో అతడిని తిట్టిపోస్తున్నారు.
వివాదాస్పద ట్వీట్లకు కేరాఫ్ ఉమైర్ సంధు!
ఇక ఉమైర్ సంధు షాకింగ్ ట్వీట్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. తీవ్ర వ్యాఖ్యలతో ఉమైర్ తీరును తప్పుబడుతున్నారు. వాస్తవానికి గతంలోనూ ఉమైర్ సంధు హీరో ప్రభాస్ పెళ్లి విషయంలో పలు రూమర్లు క్రియేట్ చేశాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ తో పెళ్లి అంటూ గాలి విషయాలు ప్రచారం చేశాడు. మహేష్ బాబుపై ఓసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ మీద రెండోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఉమైర్ సంధు నిత్యం హీరోలు, హీరోయిన్ల గురించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటాడు. గత కొంత కాలంగా ఆయన ట్వీట్లు మరీ శృతిమించుతున్నాయి.
Read Also: బోయపాటి - రామ్ మూవీ రిలీజ్ డేట్ మారిందండోయ్ - ముందే వచ్చేస్తారట!
ప్రస్తుతం పవన్ కల్యాన్ నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’,‘వినోదయ సీతమ్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial