అమెరికాలో ‘బ్రో’ ట్రెండ్ - టెస్లా కార్లతో కళ్లు చెదిరేలా లైట్ షో, వీడియో చూశారా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ ‘బ్రో’. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ మూవీను తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో కూడా పవన్ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెరికాలోని పవన్ అభిమానులు టెస్లా కార్లతో ‘బ్రో’ సినిమా పేరును క్రియేట్ చేసి పవన్ క్రేజ్ ను మరోసారి రుజువు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'గాంఢీవధారి అర్జున' టీజర్: మీ డర్టీ సీక్రెట్స్ వినే అవసరం నాకు లేదంటున్న వరుణ్ తేజ్, హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్!
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'గాంఢీవధారి అర్జున' టీజర్‌ సోమవారం సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ చూస్తే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. టీజర్ విషయానికి వస్తే.. వాతావరణ మార్పుల గురించి జరిగే ఐక్యరాజ్య సమితిలో సమావేశంలో ఇండియా తరఫున నాజర్ ప్రతినిధిగా పాల్గొంటారు. అయితే, అతడిని విలన్స్ టార్గెట్ చేసుకుంటారు. అతడిని రక్షించే బాధ్యతను ఏజెంట్ అర్జున్ (వరుణ్ తేజ్)కు అప్పగిస్తారు. ఈ సందర్భంగా వరణ్ తేజ్ స్టైలీష్ ఎంట్రీతో అదిరిపోయే యాక్షన్ సీన్స్‌ను టీజర్‌లో చూపించారు. అసలు నాజర్‌ని ఎవరు, ఎందుకు టార్గెట్ చేశారు? అనేది సినిమా కథ అన్నట్లు అనిపిస్తుంది. టీజర్‌లో సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేసినట్లే. మరి రిలీజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఇమ్మాన్యూయేల్‌తో లవ్‌పై స్పందించిన ‘జబర్దస్త్’ వర్ష - కొంతమంది కొట్టారు కూడా!
‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వర్ష ఒకరు.  అంతకముందు పలు టీవీ సీరయల్స్ లో నటించిన వర్ష ‘జబర్దస్త్’ షో తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ‘జబర్దస్త్’ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. తాను సీరియల్స్ చేస్తున్న సమయంలో ‘జబర్దస్త్’ లో చేయాలని కొందరు సలహా ఇచ్చారని తర్వాత ఆ విషయం ఆదికు వాళ్లే చెప్పారని అలా ఆయన ఓ స్కిట్ లో తనకు అవకాశం ఇచ్చారని చెప్పింది. అయితే ఆ స్కిట్ కు మంచి రీచ్ వచ్చిందని, తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పింది. ఇమ్మాన్యూయేల్ తో చేసి మొదటి స్కిట్ కు కూడా మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తమ స్క్రీన్ కాంబినేషన్ కుదిరిందని చెప్పింది. అయితే ఇమ్మాన్యూయేల్ తో రిలేషన్ గురించి అడగ్గా తర్వాత చెప్తానని దాటవేసింది వర్ష. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్లెక్సీ కడుతూ సూర్య అభిమానులు మృతి - వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో!
హీరోల పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు చేసే పనులు కొన్నిసార్లు వాళ్ల ప్రాణాలకే ప్రమాదంగా మారుతూ ఉంటుంది. ఇప్పటికే కొందరు అభిమానులు తమ హీరో పై అభిమానాన్ని చాటుకునేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనల్ని మనం చూసాం. తాజాగా మరోసారి ఓ స్టార్ హీరో అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ప్రముఖ తమిళ హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో తాజాగా ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఇక ఆ యువకుల మృతికి సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని మోపు వారి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


తమన్ చేసిన అతిపెద్ద తప్పు - తప్పని ట్రోలింగ్ కష్టాలు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ తమన్ కూడా ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా టాలీవుడ్ లో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేస్తూ వస్తున్నారు. అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తమన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో తమన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాయనే టాక్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన పరిస్థితి మరింత ఘోరంగా మారిందనట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)