Gandeevadhari Arjuna Teaser: దర్శకుడు ప్రవీణ్ సత్తారు(Praveen Sattaru) దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'గాంఢీవధారి అర్జున' టీజర్‌ సోమవారం సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ చూస్తే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.


టీజర్ విషయానికి వస్తే.. వాతావరణ మార్పుల గురించి జరిగే ఐక్యరాజ్య సమితిలో సమావేశంలో ఇండియా తరఫున నాజర్ ప్రతినిధిగా పాల్గొంటారు. అయితే, అతడిని విలన్స్ టార్గెట్ చేసుకుంటారు. అతడిని రక్షించే బాధ్యతను ఏజెంట్ అర్జున్ (వరుణ్ తేజ్)కు అప్పగిస్తారు. ఈ సందర్భంగా వరణ్ తేజ్ స్టైలీష్ ఎంట్రీతో అదిరిపోయే యాక్షన్ సీన్స్‌ను టీజర్‌లో చూపించారు. అసలు నాజర్‌ని ఎవరు, ఎందుకు టార్గెట్ చేశారు? సాక్షి వైద్య.. వరుణ్ తేజ్‌తో పనిచేయడానికి ఎందుకు నిరాకరిస్తుంది? అయినా ఎవరు వారు? మీ డర్టీ సీక్రెట్స్ వినే అవసరం నాకు లేదంటూ ఏజెంట్ అర్జున్ కామెంట్స్‌కు నాజర్ స్పందిస్తూ.. ‘‘ఇది కొన్ని లక్షల కోట్లు విలువ చేసే వ్యాపారం’’ అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేసినట్లే. మరి రిలీజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. 


'గాంఢీవధారి అర్జున' టీజర్‌ను ఇక్కడ చూడండి



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ సాక్షీ వైద్య(Sakshi Vaidya) జంటగా నటిస్తోన్న 'గాంఢీవధారి అర్జున' సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'గాంఢీవధారి అర్జున' నిలవనుంది. ఇక ఈ మూవీలో వినయ్ రాయ్ విలన్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్‌లో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 25, 2023న థియేటర్లలో విడుదల కానుంది. 


'పలాస 1978' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఒక మూవీ తెరకెక్కనుందని తెలిసింది. విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని తెలిసింది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో... 80, 90ల కాలంలో సాగే కథను కరుణ కుమార్ రెడీ చేశారట. స్క్రిప్ట్ కోసం ఆయన చాలా రీసెర్చ్ చేశారని తెలిసింది. ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 'గాంఢీవధారి అర్జున' ఇటీవలే బుడాపెస్ట్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పటికే రిలీజైన యాక్షన్ థ్రిల్లర్స్ ఏజెంట్, స్పై మూవీస్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. మరి, వరుణ్ తేజ్ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Read Also : Chiranjeevi: చిరు మరో పాన్ ఇండియా ప్రయోగం? ఆ హిట్ దర్శకుడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ - టైటిల్ ఇదేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial