Varsha: ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వర్ష ఒకరు.  అంతకముందు పలు టీవీ సీరయల్స్ లో నటించిన వర్ష ‘జబర్దస్త్’ షో తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 


హైపర్ ఆది వల్లే ఈ స్థాయిలో..


వర్ష రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో తనకు ‘జబర్దస్త్’ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. తాను సీరియల్స్ చేస్తున్న సమయంలో ‘జబర్దస్త్’ లో చేయాలని కొందరు సలహా ఇచ్చారని తర్వాత ఆ విషయం ఆదికు వాళ్లే చెప్పారని అలా ఆయన ఓ స్కిట్ లో తనకు అవకాశం ఇచ్చారని చెప్పింది. అయితే ఆ స్కిట్ కు మంచి రీచ్ వచ్చిందని, తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పింది. ఇమ్మాన్యూయేల్ తో చేసి మొదటి స్కిట్ కు కూడా మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తమ స్క్రీన్ కాంబినేషన్ కుదిరిందని చెప్పింది. అయితే ఇమ్మాన్యూయేల్ తో రిలేషన్ గురించి అడగ్గా తర్వాత చెప్తానని దాటవేసింది వర్ష. 


ఆ రోజు నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు..


మల్లెమాల ఆధ్యర్యంలో ‘సంక్రాంతి’ ఈవెంట్ కు షూట్ చేస్తున్న సమయంలో తాను కళ్లు తిరిగి పడిపోయానని చెప్పింది వర్ష. ఆ రోజు మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నామని, ఎండ ఎక్కువగా ఉండటంతో తాను బాగా డీహైడ్రేట్ అయ్యాయని, మేనేజ్మెంట్ వాళ్లు చెప్పినా వినకుండా షూట్ లో పాల్గొంటుండగా కళ్లు తిరిగి పడిపోయాయని చెప్పింది. తర్వాత వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్లీ షూట్ లోకి వచ్చేశానని చెప్పింది. అయితే అదే సమయంలో నటి పూర్ణ కళ్లు తిరిగి పడిపోవడంతో తనను తీసుకెళ్లిన కారులోనే మళ్లీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆ ఈవెంట్ లో పూర్ణ చేయాల్సిన పాటకు తాను డాన్స్ చేశానని చెప్పింది. 


అల్లు అర్జున్ కు గర్ల్ ఫ్రెండ్ గా చేస్తా..


ప్రస్తుతానికి సినిమాల మీద అంతగా ఆసక్తి లేదని చెప్పింది వర్ష. తాను చేస్తున్న పనిలో ఆనందం వెతుక్కుంటానని, తొందరపడి నిర్ణయాలు తీసుకోనని చెప్పింది. అయితే లీడ్ క్యారెక్టర్ల మీద ఇంట్రస్టె లేదని, వదిన, సిస్టర్ లాంటి పాత్రలైతే ఇష్టమని చెప్పింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు చెల్లెలు పాత్రల్లో నటించాలని ఉందని అంది. అలాగే తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు గర్ల్ ఫ్రెండ్ లాంటి చిన్న పాత్ర ఏదైనా వస్తే చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది వర్ష. 


అందుకే వాచ్ మెన్ కొడుకుని చదివిస్తున్నా..


తన ఇంటి వద్ద పనిచేసే వాచ్ కొడుకుని ఎందుకు చదివిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది వర్ష. తాను ఉదయం నుంచి సాయంత్రం వరకూ షూటింగ్ లలో పాల్గొని ఇంటికి వచ్చేసరికి చాలా టైడ్ గా ఉంటుందని చెప్పింది. ఆ వాచ్ మెన్ వాళ్ల బాబు తన ఫ్లాట్ కు వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడతాడని, అలా ప్రతీ రోజు రావడంతో ఆ బుడతడు తనకు ఫ్రెండ్ అయిపోయాడని చెప్పింది. ఆ బాబు మాటలకు స్ట్రెస్ అంతా పోయి చాలా పాజిటివ్ గా అనిపిస్తుందని చెప్పింది. అయితే ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని, ఎంతకష్టమైనా పిల్లల్ని బాగా చదివించాలని వాచ్ మెన్ ఎంతో కష్టపడుతుంటారని అందులో తనకు వీలునైంత సాయం చేస్తూ ఆ బాబు ఎడ్యుకేషన్ కు సాయపడుతున్నానని చెప్పింది వర్ష. 


ఆ వీడియోకు మంచి గుర్తింపు వచ్చింది..


తనకు మంచి గుర్తింపు వచ్చిన వాటిల్లో ఇమ్మాన్యూయేల్ తో కలిసి చేసిన బెగ్గింగ్ వీడియో కూడా ఒకటని చెప్పింది వర్ష. ఆ గెటప్ కు అంత క్రేజ్ వస్తుందని తాము అప్పుడు ఊహించలేదని చెప్పింది. షూట్ కు ముందు బెగ్గర్ గెటప్ లో సెట్ కు వస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేదని, తర్వాత తెలసి అంతా షాక్ అయ్యారని చెప్పింది. ఆ వీడియో అంతా లైవ్ లోనే చేశామని, ముందు అనుకొని చేసింది కాదని అంది. ఆ షూట్ చేస్తున్నప్పుడు చాలా మంది తమను తిట్టుకున్నారని, కొంతమంది కొట్టారు కూడా అని చెప్పింది. తర్వాత అది బాగా ట్రెండ్ అయిందని పేర్కొంది


Also Read: 'బ్రహ్మముడి' సీరియల్ - బోల్డ్ యాడ్ షూట్ లో స్వప్న, పుట్టింటికి అండగా నిలిచిన కావ్య


Join Us on Telegram: https://t.me/abpdesamofficial