Keravani: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో ఎం ఎం కీరవాణి ఒకరు. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడమే కాకుండా మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అందులోనూ డివోషనల్, హిస్టారికల్, సోషియె ఫాంటసీ సినిమాలకు ఆయన అందించే మ్యూజిక్ ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ను మరింత పెంచుతుంది. అందుకే కీరవాణికు అంత డిమాండ్ ఉంది. గతేడాది ఆయన సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఓ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో కీరవాణి పేరే కాదు తెలుగు ఇండస్ట్రీ పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా వినబడింది. ఆయన రీసెంట్ గా పి. వాసు దర్శకత్వంలో వస్తున్న ‘చంద్రముఖి 2’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 


ఆ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపాను: కీరవాణి


ప్రస్తుతం కీరవాణి ‘చంద్రముఖి 2’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దీంతో మూవీ తదుపరి పనునల్లో బిజీ అయింది. అందులో భాగంగా మూవీకు రీరికార్డింగ్ ను స్టార్ట్ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి. తాజాగా ఆయన ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో చెప్పుకొచ్చారు. "ఈ సినిమాలో పాత్రదారులు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఆ అద్భుతమైన సన్నివేశాలకు ప్రాణం పోయడానికి నేను రెండు నెలలు నిద్రపోకుండా శ్రమించాను" అంటూ ఓ ట్వీట్ చేశారాయన. అలాగే సంగీత దర్శకులు గురుకిరణ్, విద్యాసాగర్ ఆశీస్సులు కూడా కోరారు. ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీరు ఇంతలా చెబుతున్నారు అంటే మూవీలో బీజీఎం ఎలా ఉంటుందో అర్థమవుతుంది సర్’’, ‘‘ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సర్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  


దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. మధ్యలో ఇదే థీమ్ తో విక్టరీ వెంకటేష్ ‘నాగవల్లి’ అనే సినిమా చేసినా ఆ సినిమా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఈ రెండు సినిమాలకు పి. వాసు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నళ్ల తర్వాత ‘చంద్రముఖి 2’ కు సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ మూవీకు కూడా పి. వాసు దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ మూవీతో ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. 






ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్..


2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించారు. ఈసారి ‘చంద్రముఖి 2’ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా లీడ్ రోల్ లో నటించనుంది. ఇంకా రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 19 న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు. 


Also Read: చిరు మరో పాన్ ఇండియా ప్రయోగం? ఆ హిట్ దర్శకుడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ - టైటిల్ ఇదేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial