Madhuranagarilo July 24th: తను కోయదొర వేష వేయడానికి కారణం రాధ భర్త గురించి తెలుసుకోవడానికి అని తప్పించుకుంటాడు. వెంటనే సంయుక్తకు రాధ మీద అనుమానం పెంచుకొని రాధకు వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది. మరోవైపు విల్సన్ నిద్ర లేవటంతో గోపాల్ తనకు కాఫీ తీసుకువచ్చి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక వీల్సన్  ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అయోమయం అవుతుంటాడు.


ఇక గోపాల్ టిఫిన్ కూడా చేయమని.. ఎప్పుడు శిరోజ చేసిన టిఫినే తింటావా అంటూ తేడాగా మాట్లాడుతుండగా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని విల్సన్ అనుకుంటాడు. ఇక గోపాల్ తనను గోపిక అని పిలవమని అనడంతో వెంటనే విల్సన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంకా గన్నవరం ఎదురుపడటంతో రాత్రి గోపాల్ ఇలా ప్రవర్తించాడు అని చెబుతాడు.


మరోవైపు అపర్ణ, సంయుక్త రాధ ఇంటికి వస్తారు. శ్యామ్ ఎందుకు కోయదొర వేషంలో ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు. తనకు పెళ్లయిందా లేదా అని తెలుసుకోవడానికి అని రాధ అనటంతో నీకు పెళ్లి కాలేదని శ్యామ్ కు తెలిసేలాగా చేస్తున్నావా అంటూ తిరిగి రాధ పై ఫైర్ అవుతూ ఉంటారు. మా పెళ్లి జరిగే వరకు శ్యామ్ నీ పెళ్లి గురించి తెలుసుకోకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడతారు.


వెంటనే రాధ మరోసారి తనకు ఇటువంటి వార్నింగులు ఇస్తే ఈ సారీ ఏమీ ఆలోచించకుండా నేరుగా మధుర మేడం తో ఆరోజు మీరే నన్ను ఇల్లు ఖాళీ చేయించేలాగా చేశారు అన్న విషయాన్ని చెబుతాను అనటంతో దెబ్బకు సైలెంట్ గా అక్కడి నుండి వెళ్తారు. ఇక విల్సన్ కు తన భార్య సిరోజా సద్దన్నం తీసుకొని వచ్చి నైట్ అంతా ఎక్కడికి వెళ్లావు అని కోపంతో అడుగుతుంది.


అప్పుడే గోపాల్ విల్సన్ కోసం టిఫిన్ తీసుకొని వచ్చి బావ బావ అంటూ మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా కాసేపు అక్కడ సరదాగా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత మధుర సంయుక్త వాళ్లతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే పండు అక్కడికి వచ్చి బ్యాట్ గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక మధుర పెళ్లి చీర, శోభనం చీర అని రెండు చీరలు సంయుక్తకు ఇవ్వటంతో సంయుక్త తెగ సిగ్గుపడుతూ ఉంటుంది.


ఇక పండు వచ్చి శోభనం అంటే ఏంటి అని అడగటంతో మధుర ఏమి చెప్పకుండా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్తుంది. ఇక సంయుక్తను అడగటంతో వెళ్లి మీ మమ్మీ ని అడుగు తాను చెబుతుంది అని అనటంతో వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తుంటాడు. ఇక శ్యామ్ కూడా పండుని ఫాలో అవుతాడు. నేరుగా పండు తన తల్లితో శోభనం అంటే ఏమిటి అని అడగటంతో శ్యామ్ కూడా షాక్ అవుతాడు.


పండు అడుగుతున్నాడు కదా దాని గురించి చెప్పు అని అనటంతో రాధకు కోపం వస్తుంది. ఇక పండు శ్యామ్ ని అడగటంతో శ్యామ్ దాన్ని పండుకి మరోలా వివరిస్తాడు.  ఇక పండు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత రాధ శ్యామ్ పై   అరుస్తుంది. పండుని తిట్టకుండా అలా ఎందుకు చెప్పావు అని అంటుంది. తరువాయి భాగంలో మధుర వాళ్ళు శ్యామ్ పేపర్ లో రాధను పెళ్లి గుడిలో పెళ్లి చేసుకుంటున్నాను అని ప్రకటించడంతో షాక్ అవుతారు. ఇక రాధ కూడా కోపంగా ఆ పేపర్ పట్టుకుని గుడి దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో మధుర ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చి పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్న శ్యామ్ ని చూసి షాక్ అవుతారు.


also read it : Prema Entha Madhuram July 22th: అనుకి రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. నీరజ్ ను కాపాడటానికి ప్లాన్ చేసిన ఆర్య?


 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial