రాజ్ కావ్యని పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కారు దిగి కావ్య టాటా చెప్తుంటే రాజ్ కారులో ఉండి నవ్వుకుంటాడు. కనకం చెవుల కమ్మలు తీసి వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని భర్తకి ఇస్తుంది. అప్పుడే కావ్య ఇంట్లోకి వస్తుంది. కూతుర్ని చూసి సంతోషపడతారు.


కృష్ణమూర్తి: కష్టాలు అన్నీ ఈ ఇంటి గడపలోనే దాచి పెట్టి వచ్చావా?


కావ్య: లేదు నాన్న నా సంతోషాన్ని పుట్టింటికి కాస్త పంచి పెడదామని వచ్చాను. మా ఆయనకి అవసరమయ్యే జ్యుయలరీ డిజైన్స్ వేశాను. అందుకు ఆయన డబ్బు ఇచ్చారు. అవి మీకు ఇచ్చిపోదామని వచ్చాను


కనకం: ఇక్కడ ఉన్నప్పుడు నీ కష్టార్జితంతోనే బతికాం ఇప్పుడు కూడా దోచుకోమంటావా?


కావ్య: నేను పరాయి దాన్నా


Also Read: రిషిధార మీద అనుమానపడిన ఏంజెల్- రిషిని మట్టి కరిపించమని కొడుక్కి నూరిపోసిన దేవయాని


కృష్ణమూర్తి: అవును. నువ్వు ఆ ఇంటి మహాలక్ష్మిలాగా ఉండాలి. అక్కడి సంపాదన ఇక్కడికి తీసుకొస్తే పుట్టింటికి దోచి పెడుతున్నావని అంటారు. డబ్బు ఇచ్చే విషయంలో నువ్వు మాకు పరాయి దానివి


కావ్య: నేను ఈ డబ్బు గురించి ఆయనకి చెప్పి మీకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఇది నీ టాలెంట్ నాకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నా డబ్బు కోసం అక్కడ ఎవరూ ఏమి అనరు తీసుకోండి అని కృష్ణమూర్తి చేతిలో డబ్బు పెట్టబోతుంటే చెయ్యి గుప్పిట విప్పడు. దీంతో అందులో ఏముందని అడుగుతుంది.


అప్పు: ఈ ఇంటి గుట్టు


కావ్య తండ్రి గుప్పిట విప్పి చూసేసరికి చెవి కమ్మలు ఉంటాయి. ఆఖరికి ఉన్న ఒక జత కమ్మలు కూడా అమ్మే పరిస్థితి వచ్చిందా? అనేసి డబ్బు తీసుకెళ్ళి తల్లి చేతిలో పెట్టి కమ్మలు చెవులకు పెడుతుంది. నేను మీ కూతుర్ని అయిన కొడుకులాగే అండగా ఉన్నాను ఇప్పటికీ ఎప్పటికీ నన్ను పరాయి దాన్ని చేయొద్దు


కనకం అన్నపూర్ణ పరిస్థితి గురించి కావ్యకి చెప్తుంది. దీంతో తనని పలకరించడానికి వెళ్తుంది. మాయదారి జబ్బుతో అమ్మనాన్నకి భారమయ్యానని అన్నపూర్ణ బాధపడుతుంటే కావ్య ధైర్యం చెప్తుంది. కూతురి ప్రేమ చూసి ఇంట్లో అందరూ మురిసిపోతారు. ధాన్యలక్ష్మి స్వప్న చేసిన అవమానం తలుచుకుని బాధపడుతుంది. రుద్రాణి వచ్చి ఏమి తెలియనిదానిలా ఏమైందని అడుగుతుంది.


రుద్రాణి: ఎవరు ఏమన్నారు నిన్ను


ధాన్యలక్ష్మి: ఇంకెవరూ నీ కోడలు నన్ను అవమానించింది


రుద్రాణి: అయిపోయింది నిన్నే అవమానిస్తుందా? అని ఇంట్లో అందరినీ బయటకి పిలుస్తుంది. ధాన్యలక్ష్మి పరువు పోయింది. మీ అందరూ తీసుకొచ్చి నా కోడల్ని నెత్తిన పెట్టారు కదా తను వదిన్ని నానా మాటలు అంది


Also Read: కృష్ణని ప్రేమగా మెచ్చుకున్న భవానీ- అమ్మా కొడుకుని మడతేట్టిసిన ముకుంద


ధాన్యలక్ష్మి: కాస్త మంచి బట్టలు వేసుకోమని చెప్పాను. అంతే పెద్దదాన్ని అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది. అమ్మోరు తల్లిలా బంగారం దిగేసుకుని తిరుగుతానంట


రుద్రాణి: నిన్ను అంత మాట అందా? రానివ్వు దాని సంగతి చెప్తా


అపర్ణ: ఆ సంగతి అలా పెట్టు నువ్వేంటి ధాన్యలక్ష్మి మీద  ఎప్పుడు లేనిదే అంత ప్రేమ చూపిస్తున్నావ్


రుద్రాణి: ధాన్యలక్ష్మిని చిన్న పిల్లలా చూసుకున్నాం ఎవరూ ఎప్పుడు ఏం అనలేదు. దాన్ని అసలు వదిలిపెట్టకూడదు


ఇంద్రాదేవి: పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్పించాలి. ఇదే అలవాటు అయితే మంచిది కాదు


స్వప్న యాడ్ షూట్ దగ్గరకి వస్తుంది. అక్కడి వాళ్ళు స్వప్నని ఇంప్రెస్ చేయడం కోసం తెగ నటిస్తారు. ఇంతక ముందు ఈ స్టూడియో దగ్గరకి కూడా రానిచ్చే వాళ్ళు కాదు ఇప్పుడు మేడమ్ మేడమ్ అంటూ తెగ పొగిడేస్తున్నారని మనసులో సంతోషపడుతుంది. యాడ్ షూట్ చేసే అతను వచ్చి స్వప్నని బుట్టలో వేసేందుకు ట్రై చేస్తాడు. డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడతాడు. యాడ్ స్పైసీగా చేయాలని అంటే ఏం చెప్తే అది చేస్తానని స్వప్న కమిట్ అవుతుంది. రాహుల్ ఫోన్ చేసి అంతా అనుకున్నట్టే అవుతుంది కదా అని ఆరా తీస్తాడు. అనుకున్న దాని కంటే బొల్డ్ గా యాడ్ తీస్తానని అతను మాట ఇస్తాడు. కనకం కావ్యకి అన్నం తినిపించి సంతోషపడతారు.