ముకుంద కృష్ణ వాళ్ళని ఫాలో అవుతుంటే రేవతి అడ్డం పడి గుడికి తీసుకెళ్తుంది. తన బుద్ధి మార్చుకోమని చెప్పిన కూడా ముకుంద మాత్రం తెగించి మాట్లాడుతుంది. భవానీ దేవికి మురారీ తనని మోసం చేశాడని, కృష్ణ వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తానని బెదిరించి వెళ్ళిపోతుంది. తన మాటలకు రేవతి భయపడిపోతుంది. కృష్ణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కి వెళతారు. కృష్ణ ఐస్ క్రీమ్ తిందామని ఆర్డర్ ఇస్తే రెండు కాదు మూడు అనేసి ముకుంద ఎంట్రీ ఇస్తుంది. అమ్మకి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తున్నా మీ కారు కనిపిస్తే మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానని ముకుంద అబద్ధం చెప్తుంది. తనని చూసి మురారీ మొహం మాడ్చుకుంటాడు. మురారీతో పర్సనల్ గా మాట్లాడటం కోసం ముకుంద కావాలని కృష్ణ చీర మీద ఐస్ క్రీమ్ వేస్తుంది. దీంతో కృష్ణ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది.


ముకుంద: నేను ఇక్కడికి వస్తానని అసలు ఊహించలేదు కదా


మురారీ: కావాలనే కృష్ణ మీద ఐస్ క్రీమ్ వేశావ్ కదా


ముకుంద: నేను చెప్పకుండానే నీకు ఎలా తెలిసిపోయిందో చూడు. రేపో మాపో వెళ్లిపోయేదాని కోసం ఇంతగా ఫీల్ అవుతావ్ ఏంటి?


Also Read: కావ్య మనసుకి తీరని గాయం చేసిన రాజ్- ధాన్యలక్ష్మిని దారుణంగా అవమానించిన స్వప్న


మురారీ: నా భార్య నా ఇష్టం. తను ఎక్కడికి వెళ్లదు, నాతోనే ఉంటుంది


ముకుంద: రేపు సన్మానంలో కృష్ణ నిన్ను గొప్పగా ఇన్వైట్ చేస్తుంది. స్పెషల్ స్పీచ్ కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. కానీ నువ్వు తనకి సన్మానం జరిగేటప్పుడు అక్కడ ఉండకూడదు. ఉన్నా కూడా స్టేజ్ పైకి వెళ్లకూడదు


మురారీ: వెళ్తాను నేనే నా చేతుల మీదుగా సన్మానం చేయిస్తాను


ముకుంద: చేయించు నేనేమో పెద్దత్తయ్యకి మీ ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తాను. దొంగ పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారు నాటకాలు ఆడుతున్నారని చెప్పేస్తాను


మురారీ: ఏంటి బెదిరిస్తున్నావా


ముకుంద: విషయం పెద్దత్తయ్య దాకా వెళ్తే ఈ సన్మానమే మీ ఇద్దరి బంధానికి శాశ్వత ముగింపు అవుతుంది.. ఆలోచించుకో అనేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే కృష్ణ వస్తుంది. ఇక ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొచ్చారా అని భవానీ అంటుంది. అందరికీ షాపింగ్ చేయాల్సిందేనని కృష్ణ పట్టుబట్టిందని చెప్తాడు. తీసుకొచ్చిన వాటిలో ఎవరికి ఏది సెలెక్ట్ చేశామో ఎందుకు చేశామో చెప్పాలని కృష్ణ టాస్క్ ఇస్తుంది. ఛాలెంజ్ ని భవానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ముకుందని పిలవలేదేంటని భవానీ అంటే అప్పుడే ఇంటికి వచ్చిందా అంటుంది. వాళ్ళ అమ్మకి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తున్నానని మాకు కేఫ్ లో కనిపించి చెప్పిందని కృష్ణ చెప్తుంది. నాకు టెంపుల్ లో వార్నింగ్ ఇచ్చి వీళ్ళని డిస్ట్రబ్ చేసిందా అని రేవతి మనసులో అనుకుంటుంది.


Also Read: ఓరి నాయనో, ఊపిరి లేకుండా బతుకుతాం కానీ తులసి లేకుండా బతకలేమన్న అనసూయ


ఇక కృష్ణ తెచ్చిన చీరలన్నీ భవానీ ముందు పెడితే ఎవరికి ఏ చీర అనేది కరెక్ట్ గా చెప్తుంది. కృష్ణని మెచ్చుకుంటుంది. అత్తయ్య కూడా కంప్లీట్ కృష్ణ మాయలో పడిపోయింది ఏదో ఒకటి చేసి  నా ఉనికి చాటుకోవాలి లేదంటే నేనేమీ చేయలేనని ముకుంద మనసులో అనుకుంటుంది.