కావ్య అర్థరాత్రి కూర్చుని డిజైన్స్ వేస్తుంటే రాజ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. కళలకు నేను విలువ ఇవ్వనని అనుకున్నావా? నాతో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు.


కావ్య: మీ దృష్టిలో నేను ముగ్గులు వేయడానికి తప్ప ఎందుకు పనికి రాను కదా. ఆరోజు మీరు ఏం చేశారు ఫారిన్ నుంచి క్లయింట్స్ వచ్చి కూర్చున్నారని టెన్షన్ పడుతుంటే నేను మీతో ఆఫీసుకి వచ్చి డిజైన్స్ గీసి ఇచ్చాను. ఇదేమన్న ఇంటి ముందు ముగ్గు అనుకున్నావా అని చించి పారేశారు. అవే డిజైన్స్ ల్యాప్ టాప్ లో శృతి చూపిస్తే ఆమె వేసిందని మెచ్చుకుని నమ్మారు. ఆరోజు మాత్రమే కాదు అంతకముందు ఆఫీసుకి వచ్చినప్పుడు మీరు ఆ అమ్మాయిని కొప్పడుతుంటే నేనే డిజైన్ వేసి ఇచ్చాను. పెళ్ళాం వేస్తే ఇంటి ముందు ముగ్గుతో సమానం, అదే ఎంప్లాయ్ వేస్తే మాత్రం మెచ్చుకుంటారు. అందుకే కావ్య శిరీష అయ్యింది. అజ్ఞాతంలో ఉండి గియాల్సి వచ్చింది. ఏదో దొంగను పట్టుకున్నట్టు నిద్ర నటించి నన్ను పట్టుకోవడం ఎందుకు. డౌట్ వస్తే నన్నే డైరెక్ట్ గా అడగవచ్చు కదా.. నేనేం నేరం చేయడం లేదు సాయం చేస్తున్నా


రాజ్: డబ్బులు ఇచ్చి.. ఇది నీ కష్టానికి ప్రతి ఫలం. ఇది నీకు కాదు శిరీషకి కళని గుర్తించలేని మూర్ఖులు ఎవరూ లేరు


కావ్య: ఈ డబ్బు నేను తీసుకునేది నాకోసం కాదు


రాజ్: నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ డబ్బు నీ ఇష్టం శిరీష


Also Read: ఓరి నాయనో, ఊపిరి లేకుండా బతుకుతాం కానీ తులసి లేకుండా బతకలేమన్న అనసూయ


ఇక పొద్దున్నే కావ్య కాఫీ తీసుకొచ్చి రాజ్ బెడ్ పక్కన పెట్టి ఫోన్లో అలారం పెట్టి నిద్రలేపుతుంది. నిద్రలేచిన రాజ్ అలారం ఎవరు పెట్టారని అనుకుంటాడు. రాజ్ పనులన్నీ ప్రేమగా చేస్తుంది. తనకి డ్రెస్ కి సెలెక్ట్ కూడా చేస్తుంది. పొద్దున్నే కాఫీ, బ్రష్, ఇప్పుడు డ్రెస్ ఈ కళావతిలో ఇంత మార్పా అనుకుంటాడు. కావ్య రాజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కళావతి సెలెక్ట్ చేసిన డ్రెస్ కాకుండా వేరేది వేసుకొని వచ్చేసరికి కావ్య బాధపడుతుంది.


కావ్య: నేను ఇవాళ మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళి రావొచ్చా


అపర్ణ: మళ్ళీ ఏంటి ఈ రాకపోకలు


కావ్య: చూడాలని అనిపిస్తుంది


రాజ్: కన్నవాళ్ళని చూడటానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వాలా


రుద్రాణి: నీ కొడుకు ఒక్కసారి ఆ ఇంటికి వెళ్లొచ్చే సరికి అత్తకి సపోర్ట్ చేస్తున్నాడు


రాజ్: నేను సపోర్ట్ చేయడం లేదత్త. పుట్టిల్లు, అత్తిల్లు ఏదో తెలియకుండా ఈ ఇంట్లో ఉండే మీరు ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేకుండా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కళావతి నోరు తెరిచి అడిగింది పంపిద్దాం మమ్మీ


ఇంద్రాదేవి: మీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మీ అత్తకి అత్తని నేను కూడా పర్మిషన్ ఇస్తున్నా


అపర్ణ: వెళ్ళి రమ్మనండి వారాలు వారాలు ఉండటానికి వీల్లేదు


Also Read: ఎట్టకేలకు కావ్యని పట్టేసుకున్న రాజ్- కళావతికి పూలు కొనిచ్చిన మిస్టర్ డిఫెక్ట్


స్వప్న పొట్టి డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంటే రాహుల్ చూసి షాక్ అవుతాడు.


రాహుల్:  ఏంటి ఈ డ్రెస్ ఇది వేసుకుని ఇప్పుడు బయటకి వెళ్తావా


స్వప్న: యాడ్ షూట్ కి వేరే డ్రెస్ వేసుకుని వెళ్తారా?


రాహుల్: ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే ఇంట్లో వాళ్ళ గుండె ఆగిపోతుంది


యాడ్ షూట్ కి ఇంకెలా వెళ్తారని అంటుంది. ఇక కావ్యని రాజ్ తన కారులో తీసుకుని వెళతాడు. రాహుల్,రుద్రాణి స్వప్న అవతారం చూసి నవ్వుకుంటారు. ఇంట్లో వాళ్ళు దీన్ని ఇలా చూస్తే బాంబ్ పేలుతుందని సంబరపడతారు. స్వప్న అవాతరం చూసి ధాన్యలక్ష్మి చూసి కోపంతో ఊగిపోతుంది.


ధాన్యలక్ష్మి: ఈ బట్టలు వేసుకుని బయటకి వెళ్తావా? కొంచెమైన బుద్ధి ఉందా? పెళ్ళైన దానివి పైగా కడుపుతో ఉన్నావ్ ఇలాంటివి వేసుకుని వెళ్ళడానికి సిగ్గు లేదా? ఈ ఇంటికి పరువు మర్యాద ఉంది. సంప్రదాయానికి పెట్టింది పేరు. మర్యాదగా వెళ్ళి బట్టలు మార్చుకో


స్వప్న: ఎందుకు అలా అరుస్తున్నారు. నేను ఎలాంటి బట్టలైన వేసుకుంటాను. నాకు చెప్పే హక్కు మీకు లేదు. మీరంతా ఓల్డ్ జనరేషన్. రేపు మీ కొడుక్కి పెళ్ళయి కోడలు వస్తే ఇలాగే కండిషన్లు పెడితే ఒక్క రోజు కూడా ఉండకుండా పారిపోతుంది. మీరు ఇలా ఉండబట్టే మీ కొడుకు కూడా మొద్దుగా ఉన్నాడు. మీలాగా పొద్దున్నే లేచి రూపాయి కాయిన్ అంత బొట్టు పెట్టుకుని నగలన్నీ దిగేసుకుని తిరగాలా? కావాలంటే పొద్దున్నే లేవగానే ఒక గుడ్ మార్నింగ్ మీ మొహాన పడేస్తాను అంతే కానీ నా జోలికి రావొద్దు 


ఇదంతా రుద్రాణి వాళ్ళు చూస్తూ ఉంటారు. షూటింగ్ లో స్వప్న ఏం చేస్తే దుగ్గిరాల ఇంటి పరువు పోతుందో ఆ పని చేయమని కొడుక్కి పురమాయిస్తుంది. రాజ్ తనని పుట్టింటికి తీసుకెళ్తున్నాడని కావ్య మురిసిపోతుంది. కారు ట్రాఫిక్ లో ఆగిపోతే పూలు అమ్మే ఆమె వచ్చి రాజ్ ని చూసి మీరా పొద్దున్నే మీతో ఎందుకులే అనేసి వెళ్లిపోతుంటే తన దగ్గర పూలు తీసుకుంటాడు. భార్యే కాదన్న మనిషి పూలు కొన్నాడంటే అని పూలు అమ్మే ఆమె నవ్వుకుంటూ వెళ్తుంది. రాజ్ పూలు కావ్య చేతికి ఇస్తాడు. వాటిని కావ్య తలలో పెట్టుకుని సంతోషపడుతుంది.