తులసి దేవత తనని అవమానించి తన శీలాన్ని కూడా శంకించానని నందు తన తండ్రి దగ్గర బాధపడతాడు. దొంగలు పడ్డ ఆరు నెలలకి తెలుసుకున్నావని పరంధామయ్య గాలి తీస్తాడు. తులసి ఒంటరి బతుక్కి కారణం నేనే మరి అలాంటప్పుడు ఎందుకు తను నాకోసం నిలబడుతుందని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు తులసిని అని చేతులు దులిపేసుకుని ముసలాయన వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ నిద్రలేచి దివ్యని చూస్తూ కూర్చుంటాడు. ఇక పెళ్ళాంతో పొద్దు పొద్దున్నే సరసాలు మొదలుపెట్టేస్తాడు. దివ్య ఇంకా గది నుంచి బయటకి రాలేదని లాస్య టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న విక్రమ్ తాతయ్య రాజ్యలక్ష్మి, సంజయ్ కి కలిపి సెటైర్లు వేస్తాడు. చిన్న వాడికి తొందరెక్కువ, పెద్దవాడికి నిదానం ఎక్కువని అంటాడు. అప్పుడే దివ్య చెరిగిన బొట్టుతో సిగ్గు పడుతూ వచ్చి అత్తయ్య మీరు హ్యాపీనా అంటుంది. లాస్య మొహం చిరాకుగా పెడుతుంది.


విక్రమ్ దివ్య వెనుకాలే సిగ్గు పడుతూ తప్పించుకుని పారిపోతుంటే ముసలోడు ఆపేసి పరాచకాలు ఆడతాడు. దేవుడా ఇదేం ఖర్మ అనిపిస్తుంది. అయిపోయింది ఆశలు మొత్తం నీరు కారిపోయాయని లాస్య చీరకుపడుతుంది. ఇక గృహలక్ష్మి చెమటలు కక్కుతూ కాఫీ ఇస్తూ హడావుడి చేస్తుంది. కోడలిగా బంధం తెగిపోయిన తమని బాగా చూసుకుంటుందని అనసూయ తులసిని భజన మొదలుపెడుతుంది. లాస్య కోడలిగా ఉన్న ఐదేళ్లలో ఏనాడూ అయినా ప్రేమగా చూసుకుందా? ఆ ఐదేళ్లు మాకు పీడకల అంటుంది.


Also Read: ఎట్టకేలకు కావ్యని పట్టేసుకున్న రాజ్- కళావతికి పూలు కొనిచ్చిన మిస్టర్ డిఫెక్ట్


అనసూయ: ఒక మాట చెప్తాను విను. నీ ఆవేశంతో తప్పుడు నిర్ణయాలతో ఎప్పుడు తులసిని బాధపెట్టొద్దు. తన మనసు గాయపరచొద్దు. ఏం చేస్తే బాగుంటామో తనకే తెలుసు. ఊపిరి పీల్చుకోకుండా అయినా బతుకుతాం కానీ తులసి ఈ ఇంట్లో లేకపోతే బతకలేము. నీకు తులసి అవసరం ఉందో లేదో మాకు తెలియదు కానీ తను లేకుండ మాత్రం మేం బతకలేము


నందు: నేను ఇంతకముందులా లేను మారిపోయాను. తప్పులు చేయను


తులసి కిచెన్ లో పది చేతులతో పని చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. ఏదో అవసరం వచ్చి నందు కిచెన్ లోకి వస్తాడు. తను ఫోన్ మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే నందు ఫోన్ పట్టుకుని స్పీకర్ ఆన్ చేసి తన వెనుక తిరుగుతూ ఉంటాడు. కిచెన్ లో జిమ్నాస్టిక్స్ చేయించావని నందు కౌంటర్ వేస్తాడు. పిల్లలకి మొదటి రాత్రి ఆ ఇంట్లో అయ్యింది కదా ఇక మన ఇంటికి తీసుకొద్దామని తులసి చెప్తుంది.


Also Read: ఒక్కటైన విక్రమ్, దివ్య- తులసి దేవత అంటూ పొగిడిన నందు


దివ్య పాయసం తీసుకొచ్చి విక్రమ్ కి ఇస్తుంది. అది తిని సూపర్ గా ఉందని ఆహా ఓహో అని మెచ్చుకుంటాడు. మీరు తిన్న తర్వాత తిందామని ఆగానని దివ్య అంటుంది. కానీ విక్రమ్ మాత్రం బిత్తరపోయి ఒక్క స్పూన్ పెట్టమని వెంటపడుతుంది. దీన్ని బట్టి ఆ పాయసం పరమ చండాలంగా ఉందని అర్థం. కాసేపటికి దివ్య విక్రమ్ చేతిలో పాయసం తీసుకుని తిని అసలు బాగోలేదు ఛీ తూ అంటుంది. నాకు నచ్చలేదు కానీ ఆ మాట చెప్తే బాధపడతావని చెప్పలేదని అమాయకంగా చెప్తాడు. భర్త చూపించిన ప్రేమకి దివ్య మురిసిపోతుంది. ఇక నందు తులసిని పడేసేందుకు తిప్పలు పడతాడు. తను కొనిచ్చిన షర్ట్ వేసుకుని ఇంప్రెస్ చేయాలని డిసైడ్ అవుతాడు.