విక్రమ్, దివ్య మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరినీ గదిలోకి పంపించే టైమ్ కి లాస్య ఆగమని అంటుంది. వాళ్ళని లోపలికి పంపించాలని చూస్తున్నారు కానీ ముహూర్తం గురించి పట్టించుకోవడం లేదు. ముహూర్తానికి ఇంకా పది నిమిషాల టైమ్ ఉందని చెప్తుంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారులే అని విక్రమ్ తాతయ్య అంటాడు. సరేనని నందు దివ్య పది నిమిషాల తర్వాత వస్తుందని చెప్తాడు. కానీ విక్రమ్ మాత్రం అలా ఏమి వద్దు తాతయ్య చెప్పినట్టు కబుర్లు చెప్పుకుంటాంలె అంటాడు. తులసి కూడా వద్దులే ముహూర్తం చూసుకుని చేద్దామని అంటుంది. రాజ్యలక్ష్మి లాస్యని పక్కకి పిలిచి ఏం ప్లాన్ వేశావ్ చెప్పమని ఆత్రంగా ఆడుగుతుంది.
లాస్య: ప్లాన్ లేదు పాడు లేదు చేతులెత్తేశాను. కనీసం పది నిమిషాలైన దివ్యని బయట ఉంచితే బాగుంటుందని వెర్రి సంతోషం
రాజ్యాలక్ష్మీ: ఛీ నీవల్ల నేను ఏదీ ప్లాన్ చేయలేదు. నిన్ను నమ్ముకున్నందుకు ముంచావ్. ఇన్ని రోజులు విక్రమ్ ని బుట్ట కింద కోడిలా కాపాడుకున్నా. ఇప్పుడు దివ్య చేతిలోకి వెళ్తే నాకు ఆస్తి రావడం ఏమో కానీ విలువ ఉండదు. ఏం చేస్తావో నాకు తెలియదు ఫస్ట్ నైట్ జరగకూడదు. కావాలంటే దివ్యని లాక్కుని పారిపో. ఈ శోభనం జరగడానికి వీల్లేదు
తులసి: ముహూర్తానికి టైమ్ అవుతుంది వదిన
Also Read: కృష్ణని సర్ ప్రైజ్ చేసిన మురారీ- భవానీతో షికార్లు కొట్టిన తింగరిపిల్ల
రాజ్యలక్ష్మి లేకుండా దివ్యని గదిలోకి పంపిస్తే ఆవిడకి ఘోరమైన అవమానం అందుకే తీసుకొచ్చానని లాస్య అంటుంది. ఇక అందరూ కలిసి దివ్యని గదిలోకి పంపిస్తారు. ఇక ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ పంచుకుంటారు. ఇక తులసి కార్యం జరిగినందుకు సంతోషంగా దేవుడికి దణ్ణం పెట్టుకుని తిరిగి వెళ్లబోతుంటే లాస్య అడ్డుపడుతుంది.
లాస్య: నేను మీ ఫ్యామిలీ మీద ఎంత పగబట్టి ఉన్నానో తెలుసా?
తులసి: నీకు నోరు ఉంది ఎప్పుడు వాడాలో తెలియదు. తెలివి ఉందని ఎగిరిపడతావ్. నీ చేతిని నువ్వే కాల్చుకుని ఏడుస్తావ్
లాస్య: నాతో పెట్టుకుంటే ఎదురు దెబ్బ తింటావ్
తులసి: నా భర్తని లాక్కున్నావ్ ఏం సాధించావ్ చతికిలా పడ్డావ్, రాములమ్మని అడ్డం పెట్టుకుని కేసు గెలవాలని అనుకున్నావ్ ఏం సాధించావు. నా కూతుర్ని అత్తారింట్లో అడుగు పెట్టకుండా చేయాలని చూశావ్ కానీ ఏం సాధించావ్? ఇప్పుడు కూడా ఫస్ట్ నైట్ జరగకుండా చేయాలని నానాతంటాలు పడ్డావు. కానీ గదిలో నా కూతురు అల్లుడు డ్యూయెట్ పాడుకుంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి గదిలో ఏడుస్తూ కూర్చో
లాస్య: మొగుడు వదిలేస్తే నీలాగా సైలెంట్ గా ఉండటం నాకు చేతకాదు అంతకంతకూ అనుభవించేలా చేస్తాను
తులసి: నేను తలుచుకుంటే కేసు పెట్టి కటకటాల వెనుక కూర్చోబెట్టేదాన్ని కానీ ప్రశాంతంగా ఉండటం కోసం మౌనంగా ఉన్నాను. నీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా మంచిగా మారవు. కానీ నన్ను రెచ్చగొడితే నీకే నష్టం
Also Read: కావ్యని ఇరికించాలని చూసి రాజ్ చేతిలో తిట్లు తిన్న స్వప్న- బెడిసికొట్టిన కళ్యాణ్ ప్లాన్
లాస్య: ఇప్పటికే చాలా నష్టపోయాను. ఇక నేనే చేసే నష్టానికి రెడీగా ఉండు. ఇదే మాట నీతో కలిసి ఉంటున్న నా మాజీ మొగుడికి కూడా చెప్పు
తులసి: రాజ్యలక్ష్మి అండ చూసుకుని రెచ్చిపోతున్నావ్. కానీ ఇప్పుడు విక్రమ్ నా కూతురి చేతిలోకి వెళ్తున్నాడు.
లాస్య: ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన విక్రమ్ నీ కూతురి కొంగుని కట్టేసుకుంటుందని అనుకుంటున్నావా
తులసి: దివ్య నాలాగా కాదు, విక్రమ్ నందులాగా కాదు. నా కూతురు ఒక్కతే నిన్ను అడ్డుకుంటే కిందా మీద పడుతున్నావ్. నేను కూడా ఇక్కడ సెటిల్ అయితే ఏమైపోతావో ఆలోచించుకో
లాస్య: నువ్వు ఇక్కడ ఎలా సెటిల్ అవుతావ్ అంటే తులసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.
నందు ప్రశాంతంగా ఉండటం చూసి ఏమైందని అందుకు కారణం ఏంటోనని పరంధామయ్య వచ్చి అడుగుతాడు. తులసి తన జీవితాన్ని నిలబెట్టిందని మెచ్చుకుంటాడు. తులసి దేవత అంటూ పొగుడుతాడు.