స్వప్న స్కిప్పింగ్ చేయడం చూసి ఇంద్రాదేవి అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. రుద్రాణి స్వప్న తల్లిదండ్రులని పిలిచి పంచాయితీ పెట్టించాలని అంటే అందుకు రాజ్ ఒప్పుకోడు. బుజ్జగిస్తారో, భయపెడతారో అది మీ సమస్య ఇంకోసారి ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని రుద్రాణి, రాహుల్ కి కలిపి వార్నింగ్ ఇస్తాడు. కళ్యాణ్ అప్పు పని చేసే బేకరీ దగ్గరకి వస్తాడు.


కళ్యాణ్: నీ దగ్గర అప్పు పని చేస్తుంది. మా ఫ్రెండ్స్ తో పది పిజ్జాలు ఆర్డర్ ఇప్పిస్తాను. అప్పుతో మాత్రమే డెలివరీ చేయించాలి. కానీ ఇది నేను చేస్తున్నట్టు అప్పుకి తెలియకూడదు


అప్పు ఓనర్: సరే మీరు వెళ్ళండి నేను పంపిస్తాను. వెంటనే అప్పుకి ఫోన్ చేసి ఆర్డర్ వచ్చింది రమ్మని పిలుస్తాడు.


Also Read: రాజ్‌కి దొరక్కుండా తెలివిగా తప్పించుకున్న కావ్య - స్వప్నకి గడ్డి పెట్టిన దుగ్గిరాల కుటుంబం


రాజ్ కావ్య వేసిన డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సేమ్ డిజైన్స్ నా ఇంట్లో నా గదిలో దొరికాయంటే ఖచ్చితంగా కళావతే వేస్తుంది. తనలో ఇంత టాలెంట్ ఉందా? మరి ఎందుకు అజ్ఞాతంలో ఉంటుంది. నేను డిజైన్స్ కోసం పడే టెన్షన్ చూసి హెల్ప్ చేస్తుందా? ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చింది. ఒక వేళ డబ్బు అవసరమే అయితే కావాల్సినంత తీసుకోమని చెప్పాను కదా. నా డబ్బు ముట్టుకోవడం ఇష్టం లేకనా? ఇదంతా తనే చేస్తుందని కనిపెట్టాలని అనుకుంటాడు. అప్పుడే శృతి డిజైన్స్ పట్టుకుని వచ్చేస్తుంది.


రాజ్: ఫ్రీలాన్సర్ డిజైనర్ వచ్చిన తర్వాత వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది కదా. మేడమ్ మ్యానేజ్ చేసింది దొరక్కుండా అని మనసులో అనుకుంటాడు. ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని అప్రిషియేట్ చేయకపోతే ఎలా ఫోన్ చెయ్యి


శృతి: నేను మెచ్చుకుంటున్నా సర్


రాజ్: నువ్వు కాదు నేను మెచ్చుకోవాలి ఫోన్ చెయ్యి చేసి నాకు ఇవ్వు


శృతి: తన ఫోన్లో కావ్య నెంబర్ మీద పేరు మార్చి శిరీష్ అని పెడుతుంది. కావ్యకి ఫోన్ చేసి హలో శిరీష.. మీ డిజైన్స్ సర్ కి బాగా నచ్చాయి


కావ్య: ఎదురుగా ఉన్నారా?


శృతి: మా బాస్ మీతో మాట్లాడతానని అంటున్నారు తప్పదు. వాళ్ళ ఇంట్లో ఇలా మగవాళ్ళతో ఇష్టం ఉండదని చెప్తుంది సర్


ఫోన్ తీసుకుని పేరు చూస్తాడు. ఇందాక చూసిన డీటీపీ ఈ పేరు మార్పిడి అనుకుంటా అని రాజ్ కనిపెట్టేస్తాడు. ఇక నువ్వు వెళ్ళు నేను మాట్లాడి పిలుస్తాను


రాజ్: హలో శిరీష గారు గుడ్ మార్నింగ్


కావ్య: చీర కొంగు అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది


రాజ్: గొంతు మార్చే టాలెంట్ కూడా ఉంది ఈ కళావతిలో. మీ డిజైన్స్ చూసి మెచ్చుకోవడానికి చేశాను. మా ఇంట్లో మాఆవిడ ఉంటుంది. ఒక మంచి డిజైన్ వేస్తుందని ఆశపడితే పదకొండు చుక్కల ముగ్గు వేస్తూ కూర్చుంటుంది. కొంతమంది అంతే రసహీన మనుషులులాగా బతుకుతారు. ఆర్ట్ తెలియదు ఏమి తెలియదు


కావ్య: కట్టుకున్న భార్యని వేరే వాళ్ళ దగ్గర చులకన చేయడం మర్యాద కాదు


రాజ్: ఆదేమన్నా వింటుందా మామిడి పింద మొహంది


కావ్య: చాలు ఆపండి ఆ మామిడి పింది మొహం నేనే అని ఒరిజనల్ వాయిస్ లో మాట్లాడేస్తుంది. తర్వాత మళ్ళీ కవర్ చేస్తుంది. మాఆయన కూడా ఇలాగే పెళ్ళాం గురించి నీచంగా చెప్తారు. ఆయనకి నా ఆర్ట్ విలువ తెలియదు. ఇలా వేరే మొగాడు ఫోన్ చేశాడని తెలిస్తే మా ఆయన సిగరెట్ తో వాతలు పెడతాడు ఇంకెప్పుడు ఇలా చేయకండి


రాజ్: వామ్మో నేనే ముదురు అనుకుంటే ఇది నా కంటే ముదురులాగా ఉంది. తను బయట పడేవరకు నేను బయట పడను.


Also Read: ఇంటికి తిరిగొచ్చిన ఆదిత్య, వేదకి ఖుషి సపోర్ట్ - అభితో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నీలాంబరి


అప్పు వచ్చి పిజ్జా డెలివరీ చేసేందుకు తీసుకుని వెళ్ళిపోతుంది. స్వప్న తక్కువ తినడం వల్ల ఆకలిగా ఉందని అల్లాడిపోతుంది. మళ్ళీ ఎక్కువ తింటే లావైపోతానని అనుకుంటుంది. సరిగా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. డైట్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని రుద్రాణి, రాహుల్ కి అర్థంఅవుతుంది. తను పడిపోవడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కంగారుపడతారు.


కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పు పిజ్జా తీసుకొచ్చింది టిప్ గా డబ్బులు ఎక్కువ ఇవ్వమని అంటాడు. వాడు కుదురుగా ఉండకుండా అప్పు చెయ్యి పట్టుకునే సరికి లాగిపెట్టి కొడుతుంది. తన ప్లాన్ మొత్తం పాడు చేసినందుకు కళ్యాణ్ తన ఫ్రెండ్ ని తిడతాడు. డాక్టర్ వచ్చి స్వప్నకి ట్రీట్మెంట్ చేస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. కాసేపటికి స్వప్నకి స్పృహ వస్తుంది. డైట్ చేయడం వల్ల ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నారని డాక్టర్ చెప్పి బలం కోసం మందులు రాసి ఇస్తుంది. మంచి ఫుడ్ తినాలని అందరూ చెప్తారు. తినాలని అనుకున్నా చేసి పెట్టె వాళ్ళు ఉండాలి కదా అంటుంది.


కావ్య: నేను లేనా చేసిపెట్టడానికి


స్వప్న: నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నాకు మసాలా ఫుడ్ వద్దని జీరా రైస్ కావాలని చెప్పా కానీ నువ్వు చేసి పెట్టలేదు. నేనంటే నీకు అసలు పట్టడం లేదు. ఈ ఇంటికి నువ్వే మహారాణివి అనుకుంటున్నావ్. అందుకే నేను ఏది తినాలన్న పట్టించుకోవడమే మానేశావ్


ధాన్యలక్ష్మి: అబద్దం..  అని జీరా రైస్ తీసుకొచ్చి చూపిస్తుంది


రాజ్: ఏంటి ఇది మీ చెల్లి చేయలేదని ఎందుకు అబద్ధం చెప్పావ్. మా పిన్ని ఆ బౌల్ తీసుకురాకపోతే మీ చెల్లిని దోషిని చేసే వాళ్ళు కదా