ఆదిత్య ఇక్కడికి రాకపోవడానికి, ఇంతమంది బాధపడటానికి కారణం తనేనని వేద అనుకుంటుంది. తప్పు లేకపోయినా ఒక్క సోరి తో సమస్య పరిష్కారం అవుతుందని కదా అని ఆలోచిస్తుంది. అన్నయ్య అనుకున్నది ఎప్పుడు జరుగుతుందని ఖుషి యష్ ని అడిగితే చేసే వాళ్ళు చేసినప్పుడు వస్తాడులే అని సర్ది చెప్తుంది. వేద కాఫీ తీసుకొచ్చి యష్ చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. తనకి ఇంకా కోపం పోలేదా అనుకుంటాడు. మీరేం బాధపడకండి సోరినే కదా చెప్పేసి ఆదిత్యని తీసుకొస్తానని కాఫీ కప్ లో లెటర్ రాసి యష్ కి ఇస్తుంది. మాలిని ఆదిత్యని కన్వీన్స్ చేసేందుకు చూస్తుంది.


వసంత్: ఆదిత్య చాలా ఎక్కువ చేస్తున్నావ్ ఇంత మంది బతిమలాడుతున్నా వినవు ఏంటి?


మాలిని: మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వేద ఆంటీని నిలబెట్టి మీ అమ్మకి సోరి చెప్పిస్తాను పద నాన్న వెళ్దాం


ఆదిత్య: లేదు నానమ్మ వేద ఆంటీ ఇక్కడికే వచ్చి సోరి చెప్పాలి


మాళవిక: ఆదిత్య ఇక చాలు నీకోసం నానమ్మ రావడమే ఎక్కువ. వెళ్దాం పద


వసంత్: అక్కా నువ్వు వెళ్ళడం అనవసరం. నువ్వు అక్కడ ఉంటే వేద వదిన ఏదో ఒకటి అంటుందని ఆదిత్య బాధపడటం ఎందుకు నువ్వు ఇక్కడే ఉండు


Also Read: లాస్య ప్లాన్ తుస్స్, రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్- తులసిని ఇంప్రెస్ చేసే పనిలో నందు


ఆదిత్య: అమ్మ రాకపోతే నేను రాను


మాలిని: వసంత్ నా మనవడు వస్తానంటే నువ్వు ఎందుకు అలా చేస్తావ్. నాకు నా మనవడు రావడం ముఖ్యం, ఎవరు వచ్చినా నాకేం అభ్యంతరం లేదు


వేద యష్ మాటలు తలుచుకుని బాధపడుతుంది. మాళవికకి సోరి చెప్పి ఇంటికి తీసుకురావాలని బయల్దేరుతుంటే మాలిని ఆదిత్య వాళ్ళని తీసుకుని ఎదురు వస్తుంది. అన్నయ్యని చూడగానే ఖుషి సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటుంది. కొడుకుని చూసి యష్ మురిసిపోతాడు. ఇప్పుడు వేద సోరి చెప్తే ఇంకా పెద్దది అయిపోతుంది అప్పుడు యష్ కి కోపం తగ్గాక నన్ను అనుమానించే అవకాశం ఉందని అనుకుని మాళవిక ప్లాన్ మారుస్తుంది.


ఖుషి: వేద అమ్మ తరఫున నేను సోరి చెప్తున్నా అన్నయ్య


ఆదిత్య: నువ్వు కాదు వేద ఆంటీ సోరి చెప్పాలి


వేద మాట్లాడబోతుంటే వద్దు ఆదిత్య చిన్నపిల్లాడు వాడికేం తెలియదని అంటుంది. ఆమె సోరి చెప్పడానికి వస్తే ఎందుకు వద్దని అంటున్నావని ఆదిత్య అడుగుతాడు.


మాళవిక: స్టాపిడ్ ఆదిత్య ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. వేద ఆంటీ నీకోసం ఎంత చేసింది. ఒకవేళ నిన్ను ఏమైనా అంటే దానికి ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? నిజానికి తప్పు నాదే. నేను ముందే ఆదిత్యకి బుద్ధి చెప్పి ఉండాల్సింది తప్పు నాది అని వేదని కౌగలించుకుని సోరి చెప్తుంది. నువ్వు నన్ను పంపించాలని చూశావ్ కానీ చివరికి ఏం జరిగిందో చూశావా? నీ వాళ్ళే నన్ను తిరిగి తీసుకొచ్చారు. చాలా గట్టిగా పాతుకుపోయాను. నువ్వు కాదు కదా ఎవరు పంపించలేరని చెవిలో చిన్నగా చెప్తుంది.


మళ్ళీ మనవడు తిరిగి ఇంటికి వచ్చేసినందుకు మాలిని సంతోషంగా ఉంటుంది. భ్రమరాంబిక వాళ్ళు నీలాంబరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. టెస్ట్ రిపోర్ట్స్ ఇంటికి వస్తాయి. అవి ఖైలాష్ ని ఓపెన్ చేయమని చెప్తుంటే నీలాంబరి వచ్చి దేవుడి హారతి కళ్ళకి అద్దుకుని ఓపెన్ చేయమని లేదంటే బ్యాడ్ న్యూస్ అవుతుందని అంటుంది. దీంతో బిత్తరపోయిన అభి వాళ్ళు హారతి తీసుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేస్తారు. రిపోర్ట్ చూసి అభి షాక్ తో కూలబడిపోతాడు. ఆ రిపోర్ట్స్ చూసి తను నిజంగానే తల్లిని కాబోతున్నానని నీలాంబరి చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు.


Also Read: భవానీదేవిలా ఇరగదీసిన కృష్ణ, ఫ్లాట్ అయిపోయిన మురారీ- పెళ్లికి రెడీ అయిన గీతిక, గోపి


వేద మాళవిక మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం సోరి చెప్పింది. తన అసలు బుద్ధి అందరికీ తెలిసేలా ఎలా చేయాలా అని వేద ఆలోచిస్తుంటే ఖుషి వస్తుంది. యష్ కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు.


ఖుషి: నన్ను చూసుకుంటున్నట్టే అన్నయ్యని కూడా చూసుకుంటున్నావ్ కదా మరి నేను వెళ్లిపోలేదే. అన్నయ్య వెళ్లిపోయాడంటే అది తన తప్పు అవుతుంది కానీ నీ తప్పు ఎందుకు అవుతుంది. నేను ఎప్పుడు నిన్ను బాధపెట్టను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. సోరి చెప్పమని అసలు అడగను. నాకే కాదు సోరి చెప్పమని అడిగే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు. ఎందుకంటే నువ్వు మా అమ్మవి స్వీటెస్ట్ అమ్మవి. కూతుర్ని దగ్గరకి తీసుకుని ప్రేమగా ముద్దుపెట్టుకుంటుంది.


యష్: నిజమే వేదని సోరి చెప్పమని అడిగే హక్కు నాకు కానీ ఈ ఇంట్లో ఎవరికీ లేదు. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి మహారాణివి. నీకు ఎంతో రుణపడి ఉండాలి. ఖుషి చెప్పినట్టే నేను కూడా నీతో చెప్పి ఉండాలి. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఎంత బాగా చూసుకోవాలని అనుకుంటున్నానో చెప్పి ఉండాల్సింది. కానీ ఏదో ఒకరకంగా కోపం వచ్చి నిన్ను బాధపెడుతున్నా వీలైతే నన్ను క్షమించు