కృష్ణ భవానీని ఇంప్రెస్ చేయడం కోసం తనలాగా రెడీ అయి వస్తుంది. తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. భవానీ మనసులో నవ్వుకుని పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తుంది. ఏరా మురారీ యూనిఫాం వేసుకుని ఎన్ని రోజులైంది. ఆ తింగరి పిల్లకి బాడీ గార్డ్ లా తయారయ్యావ్. స్టేషన్ కి వెళ్లవా?


మురారీ: కృష్ణ స్టాపిడ్


కృష్ణ: నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నీ పెళ్ళాంతో మాట్లాడినట్టు మాట్లాడతావ్ ఏంటి. ప్రసాద్ నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రాత్రనకా పగలనకా తాగుతూ ఉన్నావంట


ప్రసాద్: నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు కృష్ణభవానీ దేవిగారు


Also Read: రిషి, మహేంద్ర మీద అనుమానపడిన ఏంజెల్- కొడుకుని హగ్ చేసుకుని ఏమోషనలైన తండ్రి


భవానీ: ఇది నన్ను ఇమిటేట్ చేస్తుందా లేదంటే నా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నేను లేనప్పుడు ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ ఇస్తుందా?


కృష్ణ: ఏయ్ మధుకర్ రీల్స్ అని చేసి నీ పెళ్ళాంతో తన్నులు తినడం కాదు సినిమా ప్లాన్ చేసుకో మన దగ్గర డబ్బులు లేవా ఏంటి? రేవతి నువ్వు ఏంటి ఇంట్లో వంట వాళ్ళని పని మానిపించేసి ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి పెడుతున్నావ్. ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పని చేయించు. నెక్స్ట్ జనరేషన్ కి మనమే నేర్పించాలి కదా


రేవతి: అలాగే అక్కా


కృష్ణ: ఏమ్మా ముకుంద గదిలో కూర్చుని బొమ్మలు గీసుకుంటూ ఆర్టికల్స్ రాసుకుంటూ ఉంటావా? మీ అమ్మకి బాగోకపోతే మాకు చెప్పవా? బాధలు మాతో పంచుకుంటే తగ్గుతాయి


ముకుంద: ఇదేంటి అత్తయ్యలాగా ఫీలై మాట్లాడుతుంది ఇన్ని చేస్తున్నా అత్తయ్య ఏమి అనడం లేదేంటని మనసులో అనుకుంటుంది. ఇక చాలు కృష్ణ అత్తయ్యలాగా చాలా బాగా చేస్తున్నావ్


కృష్ణ: అత్తయ్య ఎలా ఉంది నా పెర్ఫామెన్స్ మిమ్మల్ని అనుకరించడం కాదు అనుసరించడం కోసం చేసిన చిన్న ప్రయత్నం


ఆ మాటలకి భవానీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. అప్పుడే ఇంట్లో పని చేసే ఇక వ్యక్తి వచ్చి జీతం పెంచుతామని అన్నారు కదా పెంచండి మా తమ్ముడి పెళ్లి ఉందని అడుగుతాడు. కృష్ణ భవానీలాగా మాట్లాడుతుంది. నీ కష్టం గురించాను కాబట్టి నీకు నెలకు రెండు అనబోతుంటే భవానీ ఐదు వేలు పెంచుతున్నట్టు సైగ చేసి చూపిస్తుంది. కృష్ణ నవ్వుతూ ఐదు వేలు పెంచుతున్నానని చెప్తుంది. భవానీ కృష్ణతో నవ్వుతూ మాట్లాడుతుంది.


Also Read: భార్యను ప్రశంసలతో ముంచెత్తిన రాజ్- స్వప్న దొంగకడుపు తెలిసిపోతుందా?


గీతిక గోపి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చి గీతికని ఫ్లాట్ చేసేందుకు తెగ ట్రై చేస్తాడు. ఇంత అందమైన తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నువ్వు ఎస్ అంటే ఇక్కడే ఇదే టైమ్ కి ఎదురుచూస్తూ ఉంటానని అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోతాడు. గోపి ప్రపోజల్ బాగా నచ్చిందని తనలో నిజాయితీ ఉందని గీతిక అనుకుంటుంది. గోపిని పెళ్లి చేసుకుని మురారీ, ముకుందని ఒకటి చేయాలని అనుకుంటుంది. అటు గోపి కూడా గీతికని పెళ్లి చేసుకుని మురారీ, కృష్ణని ఒక్కటి చేయాలని అనుకుంటాడు.


మురారీ గదిలోకి వచ్చి కృష్ణ ఎత్తుకుని గిరాగిరా తిప్పేసి సూపర్ అని మెచ్చుకుంటాడు. పైకి చెప్పలేదు కానీ పెద్దమ్మ చాలా ఇంప్రెస్ అయిపోయారని చెప్తాడు. కళ్ళు తిరుగుతున్నాయి కిందకి దింపమని అనేసరికి సడెన్ గా దించేస్తాడు. దీంతో కృష్ణ నడుము పట్టేస్తుంది. ఆయింట్ మెంట్ తీసుకుని నడుముకి రాయమని చెప్తుంది. భర్త చేతి స్పర్శ తగిలేసరికి కృష్ణ హ్యాపీగా ఫీల్అవుతుంది. ఇక ఇద్దరూ కలిసి తమ తమ డ్యూటీలకి బయల్దేరతారు.