యష్ ఆదిత్య ఇంటికి రానని చెప్పాడని ఇంట్లో చెప్తాడు. ఎందుకు రానని అంటున్నాడు ఎవరి మీద కోపమని వేద అడుగుతుంది. నీమీదే కోపం ఇప్పటి వరకు చేసింది చాలని భార్య మీద సీరియస్ అవుతాడు. ఇప్పుడు ఆదిత్య డిమాండ్ ఏంటో తెలుసా నువ్వు మాళవిక దగ్గరకి క్షమాపణ చెప్పాలంట, లేదంటే ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇంటికి రాడు. వాడు అడిగినది కరెక్ట్ కాదు కానీ ఇది తప్ప వేరే మార్గం లేదని, ఎందుకు అన్నింటిలో వేలు పెడతావని అరుస్తాడు. వాళ్ళని ఎందుకు మాటలు అన్నావని మాలిని కూడా వేదని అపార్థం చేసుకుంటుంది. మాళవికని ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడే ఇలాంటివి ఆలోచించి ఉండాలి. కొన్ని చూసి చూడనట్టు వెళ్ళాలి. పట్టించుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయని కాంచన కూడా మాటలు అనేస్తుంది. నిజంగా నేనే కారణమా? నావల్లే ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా? అని వేద ఆలోచిస్తుంది.
Also Read: ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్ పాట్లు - అత్తకి అదిరిపోయే సవాలు విసిరిన కోడలు
మాళవిక వేదకి ఫోన్ చేస్తుంది. మన ఆయన గారు నా దగ్గరకి వచ్చారు. ఆదిత్య నన్ను రమ్మని అడిగితే అసలు కుదరదని చెప్పాడు.నా ఇష్టాయిష్టాలు అన్నీ వాడివి కూడా. ఇది నా మొదటి గెలుపు. కాళ్ళు పట్టించుకోవడం ఒక్కటే జరగలేదు. నువ్వు స్వయంగా వచ్చి నా చేతులు పట్టుకుని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి వస్తుందని మాళవిక అంటుంది. నువ్వు గెలవచ్చు కానీ మా మధ్య ఉన్న బంధాన్ని తెంపలేవు. ఈ క్షణం నీది అయి ఉండవచ్చు. ముందు వచ్చే గడియలు మంచితనానివే. మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఒడిపోడని ధీమాగా చెప్తుంది. ఈ మాళవిక నిన్ను రప్పించి క్షమాపణ చెప్పి తీసుకెళ్లాడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఆయన కోసం ఆదిత్యని తీసుకురావడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలని వేద అనుకుంటుంది.
రత్నం, మాలిని ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇంటికి వచ్చిన మనవడు వెళ్లిపోయాడని ఏడుస్తుంది. ఈ విషయంలో యష్ ఏం చేస్తాడు. వేద మీద చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. తను వెళ్ళి సోరి చెప్పే వరకు ఇంటికి రానని చెప్పేశాడు. వేద ఏదో ఒకటి చేసి ఆదిత్య ఇంటికి వచ్చేలా చేస్తే బాగుండని మాలిని అంటుంది. అంటే ఏంటి వేద వెళ్ళి క్షమాపణ చెప్పాలా? అని రత్నం నిలదీస్తాడు. వాడు రావడానికి ఏదో ఒకటి చేయాలి అంతే కానీ వేద క్షమాపణ చెప్పడం కుదరదు. తను మన ఇంటి కోడలు, మాళవికకి ఎందుకు క్షమాపణ చెప్పాలి. తను మన ఇంటి దేవత. వేద వచ్చాక ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. కానీ మాళవిక సంతోషాన్ని ముక్కలు చేసింది. ఇప్పటికీ కూడా ఏదో ఒకరకంగా పుల్లలు పెట్టడానికి చూస్తుందని రత్నం కరెక్ట్ గా మాట్లాడతాడు.
Also Read: భవానీ దేవి అవతారం ఎత్తిన కృష్ణ - బిత్తరపోయిన మురారీ ఫ్యామిలీ
వేద భోజనం చేయకుండా ఉండేసరికి యష్ తీసుకుని వస్తాడు. కానీ తనకి ఆకలిగా లేదని అంటుంది. అయితే తను కూడా తినాల్సిన అవసరం లేదని చెప్పేసి పడుకుంటాడు. ఇంటి దగ్గర మాళవిక ఏంటి వేద ఏమైనా ప్లాన్ చేసిందా ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మాలిని వస్తుంది. నా మనవడు నా ఇంట్లో ఉండాలి నువ్వు ఎందుకు తీసుకొచ్చావని తిడుతుంది. వాళ్ళ నాన్న వచ్చి అడిగితే వెళ్లలేదు మీరు అడిగితే వస్తే తీసుకుని వెళ్ళమని చెప్తుంది. ఆదిత్య కిందకు రాగానే ప్రేమగా దగ్గరకు తీసుకుని నీ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేశావు. అది నీ ఇల్లు పద వెళ్దామని అంటుంది. కానీ ఆదిత్య మాత్రం రానని తెగేసి చెప్తాడు. మాలిని ఎన్ని చెప్పినా కూడా ఆదిత్య వినడు. నీతో, నాన్నతో కలిసి ఉండాలని ఉంది. కానీ వేద ఆంటీ అమ్మని ఎప్పుడు ఏమి అనని చెప్పి సోరి చెప్పాలి. లేదంటే తను రానని అంటాడు. వేద మాళవికకి సోరి చెప్పడానికి ఇంకా వెళ్లలేదు ఏంటని యష్ ఆలోచిస్తూ ఉండగా ఖుషి వచ్చి అన్నయ్య ఇక రాడా అని అడుగుతుంది.