Rangula Ratnam July 19th: తన తండ్రి మారిపోయిన విషయం స్వప్న సిద్దుకు చెబుతుంది. తనను చంప మీద కొట్టాడని బాధపడుతుంది. ఇక సిద్దు కూడా గతంలో అమ్మను చాలా బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటాడు. సప్న కూడా అవును అని గతంలో అత్తయ్యను చాలా బాధ పెట్టాను అని తను చేసిన తప్పులని చెప్పుకుంటూ బాధపడుతుంది. తన తండ్రి ఆ రేఖ మాయలో పడ్డాడు అని.. తన మాటే వింటున్నాడు అని.. చాలా మారిపోయాడు అని కోపంతో రగిలిపోతుంది. ఇక ఒకప్పుడు అందర్నీ బాధ పెట్టాము కాబట్టి ఇప్పుడు తగిన శాస్త్తే ఎదురయింది అని అనుకుంటారు.
ఇక గుడిలో ఉన్న శంకర్ ప్రసాద్ ని చూసి నర్సింగ్ దగ్గరకొచ్చి పలకరించడమే కాకుండా గతంలో హాస్పిటల్ లో పావని పేరుతో పూర్ణ ఉందన్న విషయం చెబుతాడు. దాంతో అపార్థం చేసుకున్న శంకర్ ప్రసాద్ అక్కడి నుండి కోపంగా వెళ్లడంతో.. వెంటనే నర్సింగ్ ఈ విషయం రఘు కి చెప్పాలని అనుకుంటాడు. ఇంట్లో ఉన్న పూర్ణ శంకర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే శంకర్ లోపలికి వచ్చి.. అర్చన అంటూ గట్టిగా అరిచి తిడతాడు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అనటంతో నేను నీ భార్యను అని అంటుంది పూర్ణ.
దాంతో కోపంతో చెయ్యి ఎత్తుతాడు శంకర్. నీకంటే ఆ రేఖ బెటర్ అంటూ.. డబ్బు కోసం ఆశపడి ఆస్తులు మొత్తం లాక్కుంది.. కానీ నువ్వు మాత్రం పూర్ణ అని చెప్పి ఇంట్లోకే వచ్చేసావు అంటూ నోటికొచ్చిన మాటలతో తనను బాగా అవమానిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హాస్పిటల్లో పావనిగా ఉండి నన్ను మరింత మోసం చేశావు. ఒకవేళ అర్చన లాగే ఉండి సహాయం చేయాలి కానీ పేరు ఎందుకు మార్చుకున్నావు అని నిలదీస్తాడు.
గతంలోని డిఎన్ఎ టెస్టులు మ్యాచ్ కాలేదు.. నీకు చూసిన డాక్టర్ లేరని అబద్ధాలు చెప్పావు అంటూ ఛీ కొట్టి అక్కడ నుండి వెళ్తాడు. దాంతో పూర్ణ చాలా బాధపడుతుంది. ఇక నర్సింగ్ రఘు కి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. మరోవైపు సీత పుట్టింట్లో ఉండగా తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రఘు వచ్చి నాన్న కనిపించాడన్న విషయం నర్సింగ్ చెప్పాడు అనటంతో సంతోషపడతారు.
కనిపించిన సంతోషంలో అమ్మ హాస్పిటల్లో సహాయం చేసిందన్న విషయం చెప్పాడు అని.. దాంతో ఆవేశంగా వెళ్లిపోయాడు అన్న విషయాన్ని చెబుతాడు. ఇక నర్సింగ్ తొందరపడ్డాడు అని సత్యం అనడంతో.. నర్సింగ్ ను ఏమీ అనొద్దు నాన్న అని సీత అంటుంది. ఇక రఘు సీతను తీసుకెళ్తూ ఉండగా జానకి ఆపి లోపలికి వెళుతుంది. తరువాయి భాగంలో సిద్దు మెకానిక్ వ్యక్తిగా కనిపించడంతో తన మామ తనకు ఎవరితో సంబంధం లేదు అని మాట్లాడుతాడు. ఇక రేఖ కూడా పని చేసినందుకు డబ్బులను ముష్టి వేసినట్లు వేసి సిద్దు ని మరింత అవమానిస్తుంది.
also read it : Trinayani July 19th: ‘త్రినయని’ సీరియల్: భర్తను చితక్కొట్టిన హాసిని, తిలోత్తమ బోనం సమర్పించిందా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial