Trinayani july 19th: తిలోత్తమా ముక్కు నుండి రక్తం కారడంతో అమ్మవారి వల్ల జరిగింది అని అంటుంది. ఇక నయని వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి ఇది కావాలని జరగలేదు అని మొక్కుతుంది. శాంతించమని కోరుకుంటుంది. అమ్మవారి దగ్గర ఉన్న ఆకు ని తీసుకొచ్చి తిలోత్తమా ముక్కు తుడుస్తుంది. దాంతో రక్తం కారడం ఆగుతుంది. ఇక అందరూ ఊపిరి పిలుచుకుంటారు.


ఇక బోనం కుండా పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పటంతో అమాయకంగా సరే అంటుంది. ఆ తర్వాత ఒక చోట వెళ్లి కూర్చుంటుంది. అక్కడకు వల్లభ వచ్చి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడ కిటికీ లోనుండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుంది హాసిని. ఇక వల్లభ ఈ నీరసం పోవాలంటే ఒక గ్లాస్ కొట్టాలి అనడంతో మందు అనుకోని తిలోత్తమా కోప్పడుతుంది.


మందు కాదు వాటర్ అని అనటంతో తాగకుడదు కదా అని అంటుంది. ఏం కాదు అని వల్లభ తాగమని వాటర్ గ్లాస్ ఇవ్వగా హాసిని కిటికీ లో నుండి పెద్ద కర్ర తీసుకోని వల్లభను కొడుతుంది. వల్లభ గట్టిగా అరవడంతో అందరూ వచ్చి ఏం జరిగిందని అడగటంతో కింద పడి ఉన్న గ్లాస్ వైపు చూయిస్తుంది హాసిని. దాంతో అందరికి సీన్ అర్ధం అవ్వడంతో నీరు తాగితే అమ్మవారు నీ రక్తం తాగుతారు అని బెదిరిస్తారు.


వాటర్ ఇచ్చినందుకు వల్లభను నానా మాటలు అనడంతో వెంటనే తిలోత్తమా అందరిపై ఫైర్ అవుతుంది. ఇక మరోసారి సాయంత్రం వరకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. ఇక సాయంత్రం కావటంతో అందరూ తిలోత్తమా కోసం ఎదురు చూడగా ముగ్గురు కోడళ్ళు తనను బలవంతంగా తీసుకోని వస్తారు. అప్పటికే తను అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది.


ఇక ఓపికతో అడుగులు వేయమని ఇంట్లో వాళ్ళు బ్రతిమాలుతూ ఉంటారు. ఇక చివరి అడుగు వేయడానికి తిలోత్తమా ఇబ్బంది పడగా అదే సమయంలో ఎదురుగా ఉన్న అద్దంలో గాయత్రి కనిపించడంతో తానే ఆపుతుందని హాసిని, విశాల్ కనిపెట్టగా అద్దం కనిపించకుండా చేస్తాడు విశాల్. ఇక చివరి అడుగు వేయగానే అమ్మవారికి హారతి ఇచ్చి కళ్ల గంతెలు తీయగా వెంటనే అద్దం చూపించడంతో అద్దం ముక్కలు అవుతుంది.


ఇక అందరూ షాక్ అవ్వగా నయని దిష్టి పోయిందని అంటుంది. ఇక బోనం అమ్మవారికి సమర్పిస్తారు. ఇక చీకటి పడ్డాక తిలోత్తమా వల్లభను తీసుకోని ఒక చోటకి రావడంతో తను భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో గురువు అక్కడే ఉండటంతో వాళ్ళను గమనిస్తాడు. ఇక వాళ్ళు అఖండ స్వామి వద్దకు వెళ్లగా వెంటనే గురువు తిలోత్తమా కు ఏదో సందేహం ఉందేమో అని అనుకుంటాడు.


ఇక గురువు చెప్పండి అనడంతో వెంటనే వల్లభ తన తల్లికి తిన్నది అరగలేదు అని అంటాడు. దాంతో తిలోత్తమా వాడు ఏదో వాగుతున్నాడు. ఉదయం నుండి ఉపవాసం ఉండటంతో సాయంత్రం తినడంవల్ల కాస్త జీర్ణం అవ్వలేదు అని అంటుంది. ఇక స్వామి నిశ్చింతం లేకుండా ఉండమని అంటాడు.


also read it : Rangula Ratnam July 18th: ‘రంగులరాట్నం’ సీరియల్ : కూతురి చెంప పగలగొట్టిన చక్రి, పూర్ణ పై ఫైరైన శంకర్ ప్రసాద్?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial