కృష్ణ సాధించిన విజయాన్ని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. పొద్దున పెద్దత్తయ్య గెటప్ వేసి ఇంప్రెస్ చేసింది. ఇప్పుడేమో సన్మానం, అవార్డు అని మనసులు గెలుచుకుంది. ఇలా అయితే కృష్ణ నా ఆస్తిత్వవానికి ప్రమాదం, అలా జరగకూడదని ముకుంద మనసులో అనుకుంటుంది. పైకి మాత్రం కృష్ణకి కంగ్రాట్స్ చెప్పి మరిన్ని అవార్డులు సాధించాలని చెప్తుంది. కృష్ణ తన కోడలిగా రావడం ఎంతో గర్వంగా ఉందని రేవతి మెచ్చుకుంటుంది. గదిలోకి వచ్చిన తర్వాత కృష్ణ తన అమ్మానాన్న ఫోటోలు చూసుకుంటూ ఎమోషనల్ అవుతుంది.


కృష్ణ: నేను చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ కావాలని నా దగ్గర మాట తీసుకున్నావ్. అది ఈరోజు నెరవేరింది. మీ బ్లెస్సింగ్ తో సాధించాను. ఈరోజు మీరిద్దరూ ఉండి ఉంటే చాలా బాగుండేది అని ఏడుస్తుంటే మురారీ వస్తాడు.


మురారీ; ఫస్ట్ టైమ్ దేవుడి మీద కోపం వచ్చింది. ఈ ఫోటోలు నీ పుట్టిల్లు చేసినందుకు. వాళ్ళే ఉంటే నువ్వు హ్యాపీగా ఉండేదానివి కదా


Also Read: కావ్యని ఇరికించాలని చూసి రాజ్ చేతిలో తిట్లు తిన్న స్వప్న- బెడిసికొట్టిన కళ్యాణ్ ప్లాన్


అప్పుడే భవానీ దేవి మురారీ వాళ్ళని కిందకి పిలుస్తుంది. కృష్ణ కళ్ళు ఎర్రగా ఉండటం చూసి ఏమైందని కళ్ళలో కన్నీళ్ళు ఏంటని అడుగుతుంది. వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడుతుందని మురారీ చెప్తాడు. ఇద్దరినీ షాపింగ్ కి వెళ్ళమని భవానీ చెప్తుంది.


రేవతి: నీ భార్యకి ఏం గిఫ్ట్ ఇవ్వవా


మురారీ: రెండు నిమిషాల్లో ఇస్తాను. తనకి మాత్రమే కాదు మీ అందరికీ కూడా సర్ ప్రైజ్


కృష్ణ కళ్ళు మూసి మురారీ ఇంటి బయటకి తీసుకుని వెళతాడు. అక్కడ కొత్త స్కూటీ ఉంటుంది. అది చూసి కృష్ణ చాలా సంతోషపడుతుంది. అమ్మో ఏసీపీ సర్ నాకోసం బెలూన్స్ కొనిచ్చారా అని ఎగిరి గంతులేస్తుంది. మళ్ళీ టూ వీలర్ కొనిచ్చారా, నా మనసు మీకు తెలుసు ఐ లవ్ ఇట్ అని వెళ్ళి గట్టిగా కౌగలించుకుంటుంది. అందరూ సిగ్గుపడిపోతారు. భవానీ చేతుల మీదుగా బైక్ తాళాలు కృష్ణకి ఇప్పిస్తాడు. మీ చేతుల మీదుగా కీస్ ఇచ్చారు కదా ముందు మీరే బైక్ మీద తనతో రావాలని కృష్ణ పట్టుబడుతుంది. దీంతో చేసేది లేక భవానీ బైక్ ఎక్కుతుంది. ఇద్దరూ కాసేపు స్కూటీ మీద షికార్లు చేస్తారు. ఆ తర్వాత మురారీతో రైడింగ్ కి వెళ్తుంది.


ఇంట్లో తనకి విలువ కూడా లేకుండా పోయిందని అలేఖ్య అంటే మధుకర్ జోకులు వేస్తాడు. దీంతో కుళ్ళబొడుస్తుంది. ముకుంద అది చూసి అలేఖ్యని ఆపుతుంది. కృష్ణకి పెద్దత్తయ్య లక్ష రూపాయలు వేసింది షాపింగ్ కి వెళ్ళమని మనకి అలాంటివి ఏవి ఉండటం లేదని అడిగితే నోటికొచ్చినట్టు వాగుతున్నాడని అలేఖ్య అంటుంది. అంటే కృష్ణ వాళ్ళు షాపింగ్ కి వెళ్లారా? వాళ్ళు వాళ్ళ ప్రేమని ఒకరికొకరు చెప్పుకుంటే ఎలా అని ముకుంద టెన్షన్ పడుతుంది. ఇప్పుడు వీళ్ళని అలాగే వదిలేయడం చాలా ప్రమాదం, ఫాలో అవాలని డిసైడ్ అవుతుంది. హడావుడిగా వెళ్లబోతుంటే భవానీ పిలిచి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది.


Also Read: ఇంటికి తిరిగొచ్చిన ఆదిత్య, వేదకి ఖుషి సపోర్ట్ - అభితో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నీలాంబరి


భవానీ: నువ్వు బాగా చదువుకున్న దానివి కదా మాతో పాటు నువ్వు కూడా ఆదర్శ్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు కదా


రేవతి: అక్కా నువ్వు లేనప్పుడు కూడా నేను చెప్పాను కానీ లెక్క చేయలేదు


ముకుంద: మీరే నా జీవితానికి దారి చూపించాలి. మీ మీదే ఆశలు పెట్టుకున్నా. మా అమ్మని చూసి చాలా రోజులైంది వెళ్ళి తనని చూసొస్తాను