Trinayani july 21th: అఖండ స్వామి ఇంటికి రావడంతో  పూలదండతో సన్మానం చేయడం, గాయత్రి, గానవి ని చూపించడం జరుగుతుంది. అయితే మొదట గాయత్రి ని చూడటం వల్ల గానవి కూడా తనకు గాయత్రి లాగా కనిపిస్తుంది. ఇక ఇద్దరు కవల పిల్లలు అని ఇద్దరు ఒకే లాగా ఉన్నారు అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ గాయత్రి, గానవి ఉన్నారు అని అనటంతో అఖండస్వామి.. వారి పేర్లు వేరైనా రూపం ఒకటే అని అంటాడు.


ఇక అందరికీ ఏమీ అర్థం కాదు. పైగా ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారని అనటంతో.. లేదు వేరే వేరే డ్రెస్ వేసుకున్నారు అని వాళ్ళు అంటారు. వీరిద్దరికి అసలు పోలికలు లేవు అని హాసిని కూడా అంటుంది. అలా కాసేపు అఖండ స్వామికి ఫ్యామిలీకి మధ్య ఇదే వాగ్వాదం జరుగుతుంది. ఇక వెంటనే గురువు తన మనసులో మంత్రపుష్పగుచ్చం ఇచ్చినందుకు అఖండ స్వామికి అలా కనిపిస్తుంది అని అనుకుంటాడు. విశాల్ కూడా ఇదంతా మంత్రపుష్పగుచ్చం వల్ల జరుగుతుంది అని గమనిస్తాడు.


ఇక తను కూడా అఖండ స్వామి చెప్పినట్లే అవును ఇద్దరు ఒకేలాగా కనిపిస్తున్నారు అని అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా విషయాలను పిచ్చి పట్టిందా అని అనటంతో అవును నాకు పిచ్చే అని అంటాడు. అఖండ స్వామిని కూడా అదేవిధంగా అంటారు. భ్రమ లేదని అంటుంటారు. వెంటనే అఖండస్వామి గురువుని మీరైనా చెప్పండి అనడంతో.. విశాలాక్షి అమ్మవారి శక్తి ముందు మనం ఎంత అని మాట్లాడుతాడు.


దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్తేనే బాగుంటుంది అని అనటంతో తిలోత్తమా నిజం తెలుసుకోలేకపోతున్నానని కంగారు పడుతూ ఉంటుంది. అఖండ స్వామి అవమానాన్ని తట్టుకోలేక మంత్రపుష్పం, పూలమాల తీసి అక్కడ నుండి కోపంగా వెళ్తాడు. ఆ తర్వాత గురువు విశాల్ ను ఆ మంత్రపుష్పగుచ్చం తీసుకొని రమ్మని అంటాడు. ఇక ఇద్దరు ఇంటి బయట మాట్లాడుతూ ఉంటారు. సమయానికి మీరు వచ్చినందుకు బతికిపోయాము అనే విశాల్ అంటాడు.


లేదంటే నిజం తెలిసేదేమో అని అంటాడు. ఇక గురువు కూడా అఖండ స్వామికి ఛాయాశక్తులు ఉన్నాయని కానీ విశాలాక్షి అమ్మవారి దయతో మంత్రపుష్పగుచ్చం వల్ల ఆయనకు ఇద్దరూ ఒకేలాగా కనిపించారు అని అంటాడు. ఇక విశాల్ గాయత్రి కాకుండా గానవి ఎందుకు కనిపించలేదు అని అనటంతో.. తిలోత్తమా అఖండ స్వామి దగ్గరికి వెళ్లడాని నేను చూశాను. అక్కడ తను గాయత్రి పాప గురించి మాట్లాడటంతో.. గాయత్రి ని చూడటానికి వచ్చాడు అఖండ స్వామి.


అలా మొదట గాయత్రిని చూసాడు కాబట్టి తనకు మళ్లీ గాయత్రి కనిపించింది అని అంటాడు. ఇక పాప పెద్దయ్య వరకు మీ తోడు మాకు అవసరం అని అంటాడు విశాల్. మరోవైపు గదిలో అఖండ స్వామి ఎందుకు ఇలా ప్రవర్తించాడు అని కులగురువు ఉన్నందుకు ఏమైనా జరగవచ్చా అని అనుమానం పడుతుంటారు తిలోత్తమా, వల్లభ. వెంటనే హాసిని వారిని చూసి వారిని డిస్టర్బ్ చేసి ఆ మాటలు మాట్లాడకుండా చేస్తుంది.


మరోవైపు నయని గాయత్రిని అద్దం ముందు నిలబెట్టి ఇందులో ఎవరు కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే విశాల్ వచ్చి ఏం జరిగింది ఇలా చేస్తున్నావు అనటంతో అఖండస్వామి అలా ప్రవర్తించాడు కదా మన ఇంట్లోకి వచ్చిన ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ప్రవర్తిస్తున్నారు అని కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో విశాల్  అలాంటిదేమీ లేదు అమ్మ దహన సంస్కారం ఇక్కడే చేశాము కాబట్టి ఎంతో కొంత ప్రభావం ఉంటుందని అంటాడు.


also read it: Prema Entha Madhuram July 20th: కేక్ లో విషం కలిపిన మాన్సీ.. సర్ప్రైజ్ తో సంతోషంగా ఉన్న ఆర్య?



 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial