Prema Entha Madhuram July 20th: ఆర్య అద్దం వైపు చూస్తూ దానిమీద ఉన్న అను బొట్టు చూసి అనుని గుర్తుకు చేసుకుంటాడు. నన్ను ఎలా వదిలి ఉంటున్నావు.. అసలు నాకు దూరంగా ఉండటానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడే అను వచ్చిందని భ్రమలో ఉంటాడు. ఇక అను తన బర్త్డే అని తనను కూడా తయారు చేయమని అంటుంది.
తనకు నగలు వేసి పువ్వులు పెడతాడు. చాలా అందంగా ఉన్నావు అంటూ పొగుడుతాడు. ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉండి బాధ పెట్టావు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జెండే, నీరజ్ రావటంతో అను వచ్చింది అని సంతోషంగా చెబుతాడు. చూసేసరికి అక్కడ అను ఉండదు. దాంతో ఆర్య బాధపడుతూ ఉండగా జెండే అను ఆలోచనలో ఉంటూ నిన్ను నువ్వే మర్చిపోతున్నావు అని.. నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ఇక నీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. తను కూడా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. మరోవైపు అను డెకరేషన్ పూర్తి చేసేస్తుంది. అప్పుడే ప్రీతి పిల్లల్ని తీసుకొని వస్తుంది. పిల్లలను ఆడించడానికి టెడ్డీబేర్ ను అరేంజ్ చేసావా అని అను అడగటంతో ఆ ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళాడు అని అంటుంది ప్రీతి.
ఇక అప్పటికే టెడ్డీబేర్ వేసుకొని ఉన్న నరేష్ ను మాన్సీ కొట్టటంతో అతడు కింద స్పృహ లేకుండా పడిపోతాడు. ఇక ఆ టెడ్డి బేర్ గెటప్ మాన్సీ వేసుకొని బయటికి వస్తుంది. అప్పుడే ప్రీతి నరేష్ అని పిలవడంతో ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని భయపడుతుంది మాన్సీ. ఇక మాట్లాడకుండా చేతులతో సైగలు చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలను ఆడిపించడానికి బయలుదేరుతుండగా అప్పుడే అను ఆపి ఎక్కువసేపు ఉండటం చాలా కష్టం మరో వ్యక్తిని అరేంజ్ చేసుకోమని చెబుతుంది.
ఇక ప్రీతి అనుతో అందరిని బాగా అర్థం చేసుకుంటావు కదా అనడంతో ఆర్య సార్ దగ్గర నేర్చుకున్నాను అని అంటుంది. ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అప్పుడే బాబు ఏడుస్తున్నాడని ఒక ఆవిడ తీసుకొని వస్తుంది. ఇక బాబు అంత ఏడుస్తుంటే పాప కూడా ఏడుస్తుందేమో అని రేష్మ కు ఫోన్ చేయమని అంటుంది. అదే సమయంలో రేష్మ కూడా పాప ఏడుస్తుందని వస్తుంది. బాబు, పాప దగ్గరగా ఉండటంతో ఊరుకుంటారు.
వీరు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే అనుమానం వస్తుంది అని అను పాపని తీసుకొని ఒక గదికి వెళుతుంది. ఇక బాబు ఏడుస్తూ ఉండగా అక్కడికి శారదమ్మ వచ్చి కాసేపు ఎత్తుకుంటుంది. అను ఉన్న గది వైపే వెళ్తూ ఉండగా అక్కడ మరో పాప ఏడుస్తున్నట్టు సౌండ్ రావడంతో ఆ గదిలోకి వెళ్లి చూడాలి అని అనుకుంటుంది. వెంటనే రేష్మ వచ్చి తనను ఆపుతుంది. ఇక బాబుని తీసుకెళ్తాను అని తీసుకెళ్తుంది.
మాన్సీ పిల్లలను ఆడిపిస్తూ కుటుంబానికి దగ్గరగా ఉండి సంతోషపడాలని నువ్వు ఆ ముసుగు వేసుకున్నావు.. ఆర్యని చంపడానికి నేను ఈ ముసుగు వేసుకున్నాను అని అనుకుంటుంది. మరోవైపు గదిలో ఆర్య బాధపడుతూ ఉండగా శారదమ్మ వచ్చి ధైర్యం చెబుతూ ఉంటుంది. అంజలి కూడా వచ్చి పిల్లలు ఎదురు చూస్తున్నారు అనటంతో ఆర్య వాళ్ళందరికీ కిందికి వెళ్తారు. ఇక అక్కడ పిల్లలు అను ఫేస్ మాస్క్ తో బర్త్డే విషెస్ చేయటంతో ఆర్య సంతోషంతో పొంగిపోతాడు. అను కూడా సంతోషంలో కనిపిస్తుంది. మాన్సీ కేకులో విషం కలుపుతుంది.
also read it : Madhuranagarilo July 19th: ‘మధురానగరిలో’ సీరియల్: సంయుక్తకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాధ, అసలు నిజం తెలుసుకున్న శ్యామ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial