Madhuranagarilo July 19th: గుడిలో ఒక ఆవిడ ఒంటిమిదికి అమ్మవారు పూనటంతో అక్కడ అందరి భవిష్యత్తు గురించి చెబుతూ ఉంటుంది. వెంటనే రాధ అక్కడికి వెళ్లి పండు వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. వెంటనే ఆవిడ మీ దగ్గరలోనే ఉన్నాడు.. మీ చుట్టే తిరుగుతున్నాడు.. కానీ మీరు కనిపెట్టలేకపోతున్నారు ఎవరు ఆయన అని అడుగుతుంది రాధ. అదే సమయంలో మరొకరు అమ్మవారి దగ్గరికి రావటంతో రాధను పక్కకు నెట్టేస్తారు.
రాధ ఆలోచనలో పడుతుంది. తర్వాత సంయుక్త తన తల్లితో రాధ బోనం ఎత్తుకుందని.. కచ్చితంగా తనకు శ్యామ్ తో పెళ్లి జరుగుతుందేమో అని భయపడుతూ చెప్పటంతో అలా చూస్తూ ఊరుకునే దాన్ని కాదు అని శ్యామ్ తో నీకే పెళ్లి జరుగుతుంది అని.. ఒకవేళ అడ్డుపడితే తన పని చేస్తాను అని అంటుంది. ఇక ఇంట్లో ఉన్న రాధ దగ్గరికి వచ్చిన శ్యామ్ గాయానికి వెన్నుపూస పెట్టడానికి వచ్చాను అంటాడు.
తన కాళ్ళు పట్టుకొని వెన్నుపూస పెడుతూ ఉండగా కాళ్ళు పట్టుకోకండి అని అంటుంది. అంటే తప్పు చేసిన వాళ్ళే కాళ్లు పట్టుకోవాలా అని శ్యామ్ అంటాడు. ఆ విధంగా చూసినట్లయితే నేను కూడా నీ విషయంలో తప్పు చేశాను కదా అని జరిగిన విషయం గుర్తుకు చేస్తాడు. మామూలుగా అందరూ కాళ్లు పట్టుకోకుండా చేతులు పట్టుకొని ఇవే కాళ్ళు అని అంటారు కదా ఇప్పుడు నేను కాలు పట్టుకున్నాను అవే చేతులు అనుకో అని వెన్నుపూస పెడుతూ ఉంటాడు.
మరోవైపు వాసంతి ఇంటికి ఒక ముష్టివాడు వచ్చి అన్నం అడగటంతో చేతులు ఖాళీ లేదు అని అనగా నేను వచ్చి పెట్టుకుంటానులే అని అంటాడు అతను. దాంతో వాసంతి అతని తిట్టి పంపించగా అతడు గన్నవరం కి ఎదురుపడతాడు. నా భార్య నీకు అన్నం పెట్టలేదా తనని ఇంటికి తీసుకెళ్ళగా అతడు మళ్ళీ అన్నం పెట్టమని అడుగుతాడు. ఈ సారి గన్నవరం కూడా అదే డైలాగ్ చెబుతాడు.
ఇంట్లో రాధ పాలు పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచనలో పడగా అక్కడికి వచ్చిన మధుర పొంగుతున్న పాలను ఆఫ్ చేసిన రాధను పిలుస్తుంది. ఇక ఏం జరిగింది అని అడగడంతో గుడిలో అమ్మవారు వచ్చిన ఆవిడ చెప్పిన విషయాలు చెబుతుంది. దాంతో ఎలాగైనా పండు వాళ్ళ నాన్న దొరుకుతాడు అని ధైర్యం ఇస్తుంది. కానీ అతనిని గుర్తుపట్టాలి కదా అని రాధ పొరపాటున అని మళ్లీ సరిదిద్దుకుంటుంది.
ఇక మధుర కనపడిన వెంటనే అతనికి వార్నింగ్ ఇస్తాను అని అంటుంది. ఇక పసుపు కొట్టే కార్యక్రమం ఉంది అని రమ్మని చెప్పింది. ఆ తర్వాత రాధ, పండు మధుర ఇంటికి వెళ్లగా మధుర పసుపు కొట్టే ఏర్పాటు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక అప్పుడే అక్కడికి సంయుక్త తన తల్లితో వచ్చి రాధను తన మాటలతో అవమానిస్తూ ఉంటుంది.
వెంటనే రాధ తనకు తన స్టైల్ లో గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఎలాగైనా నీకు, శ్యామ్ కు పెళ్లి జరుగుతుందని.. మళ్ళీ నా జోలికి వస్తే ఈ సారి ఇళ్ళు నువ్వే ఖాళీ చేయాలని చూసావన్న సంగతి చెబుతాను అని బెదిరిస్తుంది. తర్వాయి భాగంలో పసుపు నేను ముందు కొడతాను అని సంయుక్త అనగా.. మధుర పెళ్లయిన వారితో చేయించాలి అని రాధను అంటుంది. కానీ రాధ తనకు దెబ్బ తగిలిందని చేతికి కట్టు కట్టుకుంటుంది. అయితే శ్యామ్ రాధ చేతికి గాయం అవ్వలేదని తెలుసుకొని అంటే నీకు పెళ్లి జరగలేదు అన్నమాట నిజం కదా అంటాడు. వెంటనే రాధ అవును నాకు పెళ్లి జరగలేదు అంటుంది.
also read it : Prema Entha Madhuram July 18th: ‘ప్రేమ ఎంత మధురం’: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. టెన్షన్ లో రేష్మ, ప్రీతి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial