Trinayani july 18th: ఇంట్లో బోనం ఏర్పాట్లు చేస్తారు. అమ్మవారికి కళ్లకు గంతలు కట్టడంతో వల్లభ ఎందుకు కట్టారు అని అడుగుతాడు. ప్రతిష్టాపన పూజ చేసేటప్పుడు గంతలు తీయాలని చెబుతాడు విశాల్. కొత్త అద్దంలో అమ్మవారిని చూయించి దిష్టి తీయాలి అని నయని చెబుతుంది. అప్పుడే తిలోత్తమా వస్తుంది. ఇక బోనం ఎత్తమని వల్లభ అనటంతో.. శుభ ముహూర్తంలో ఎత్తాలి అని అంటుంది నయని.


ఇక బోనం ఎత్తుకునే ముందు తినడానికి ఏమైనా కావాలి అని తిలోత్తమా అనడంతో సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలని చెబుతారు. శుభ ముహూర్తం రావడంతో నయని, హాసిని బోనం ఎత్తుతారు. ఇక విక్రాంత్ బోనం సరిగా ఉంచుకోమని లేదంటే రక్తం కల్లారా చూస్తావు అని అనటంతో తిలోత్తమా కాస్త భయపడుతూ ఉంటుంది. మధ్యలో హాసిని వెటకారం చేస్తూ ఉంటుంది.


తిలోత్తమా బోనం ఎత్తుకొని బయట వచ్చి కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే వల్లభ అక్కడికి వచ్చి ఫోటోలు దింపుతాను అని అనటంతో అక్కడికి ముగ్గురు తోటి కోడలు వచ్చి తనను ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంటారు. హాసిని మళ్ళీ వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా తిలోత్తమా ని రెచ్చగొడుతూ ఉంటుంది.


మోయడానికి కష్టంగా ఉంది ఏం చేయాలి అని తిలోత్తమా అనటంతో వెంటనే నయని అమ్మవారిని తలుచుకోలమంటుంది. ఇక హాసిని దొరికిందే ఛాన్స్ అని బాగా వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక కాసేపు బోనం తీసుకోమని తిలోత్తమా అడగటంతో ఇంట్లో పూజ చేశాం కాబట్టి సాయంత్రం వరకు ఉండాలి అని ఉంటుంది. వెంటనే హాసిని ఇలా సోఫాలో కూడా కూర్చోవద్దని బలవంతంగా లేపుతుంది.


ఎందుకు అమ్మని బలవంతంగా లేపుతున్నావు అని వల్లభ అనటంతో ఏమైనా జరుగుతే మీ అమ్మ శవాన్ని మోయాల్సి వస్తుంది అని హాసిని అంటుంది. ఇక హాసిని మొత్తం అపశకన మాటలు మాట్లాడుతూ తిలోత్తమాని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత హాసినిని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారు. మరోవైపు ఓపిక నశించిన తిలోత్తమా లోపలికి రావటంతో అప్పుడే గాయత్రి పాప తన దగ్గరికి వస్తుండటంతో భయపడుతూ ఉంటుంది.


ఇక తిలోత్తమా వెళ్ళు వెళ్ళు అని అనటంతో గాయత్రి దగ్గరికి వస్తుంది. ఇక వెనకకు వెళ్లి తిలోత్తమా కొంగు లాగుతుంది గాయత్రి. దాంతో దెబ్బకు మూకుడు కింద పడిపోవడంతో భయపడుతుంది. అందరూ వచ్చి షాక్ అవుతారు. కళ్ళు తిరిగాయా అని నయని అడగటంతో నీ కూతురు వచ్చింది అని అంటుంది. పిల్లల్ని వదిలేసి ఎందుకంత బిజీగా ఉన్నారు అని అరుస్తుంది.


ఇక పావని మూర్తి అదే సమయంలో ఫోన్ రావడంతో బయటికి వెళ్లాను అని అంటాడు. ఇక గాయత్రి తన చీర కొంగు లాగింది అని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. వల్లభ తల్లితో నీది ఏమి తప్పులేదు ఆ పిల్ల నీ పట్టుదల పరీక్షించింది అని అంటాడు. అదే సమయంలో సుమన గట్టిగా అరుస్తుంది. ఏం జరిగింది అని అందరూ అడుగుతూ ఉంటారు.


అత్తయ్య ముక్కులో నుంచి రక్తం వస్తుంది అని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. తిలోత్తమా భయపడుతూ ఉంటుంది. ఇక విశాలాక్షి చెప్పినట్టు జరిగింది అని విశాల్ అంటాడు. అంటే నేను చచ్చిపోతానా అని తిలోత్తమా అనటంతో వెంటనే హాసిని వెటకారంతో ఏడుస్తూ ఉంటుంది. తిలోత్తమాకు బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ ని పిలవండి లేదా హాస్పిటల్ కు తీసుకెళ్లండి అని సుమన అంటుంది. 


ఇక బోనం కుండ దించి ఎక్కడికి వెళ్ళరాదు అని డమ్మక్క చెబుతుంది. ఎవరు వచ్చిన లాభం లేదు అని ఇది అమ్మవారి వల్ల జరిగింది అని అంటుంది. ఇక నయని వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి కావాలని జరగలేదు అని మొక్కుతుంది. శాంతించమని కోరుకుంటుంది. అమ్మవారి దగ్గర ఉన్న ఆకు ని తీసుకొచ్చి తిలోత్తమా ముక్కు తుడుస్తుంది. 


Also read it : Krishnamma kalipindi iddarini July 17th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్: గౌరీని క్షేమంగా తీసుకొచ్చిన ఈశ్వర్.. ఆదిత్య పెళ్లి జరగనివ్వనంటూ సునందకు పెద్ద షాకిచ్చిన అమృత?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial