Madhuranagarilo July 21th: శ్యామ్ రాధ ఇంటికి వెళ్లి   చెయ్యి కాలింది కదా ఆయింట్మెంట్ పెడతాను ఇది పెడితే నొప్పి తగ్గుతుంది అని అంటాడు. కానీ రాధ మాత్రం నేను అప్పుడే క్రీం పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏమి వద్దు అని అంటుంది. ఇక శ్యామ్ దీంతో బాగా తగ్గుతుంది చేతికున్న కట్టు ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాధ మాత్రం వద్దు అంటుంది. ఇక శ్యామ్ కట్టు తీయడంతో అక్కడ ఎటువంటి గాయం ఉండదు.


దాంతో వెంటనే శ్యామ్ అంటే పసుపు కొట్టకూడదని ఇలా చేశావు కదా.. అంటే నీకు పెళ్లి జరగలేదు కదా అని అంటాడు. కానీ రాధ మాత్రం అలా ఏమీ లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక శ్యామ్ మాత్రం అసలు ఊరుకోడు. నీకు పెళ్లి జరగలేదు కాబట్టి అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఇలా గాయమైందని అబద్ధం చెప్పావు.


అంటే నీకు నిజంగానే పెళ్లి జరగలేదు అని అంటాడు. ఇక రాధ తనకు పెళ్లి జరిగింది అని కానీ అతడికి దూరంగా ఉంటున్నాను అని అంటుంది. పెళ్లి జరిగితే మెడలో తాళిబొట్టు, నుదుట కుంకుమ బొట్టు, కాళ్లకు మెట్టెలు ఉండాలి కదా అని అంటాడు. వెంటనే రాధ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. ఆయనకు దూరంగా ఉంటున్నాను కాబట్టి పెట్టుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. ఇక తనకు నిజంగానే పెళ్లి జరిగింది అని మొండిగా చెప్పేస్తుంది.


శ్యామ్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా రాధ అలాగే చెప్పటంతో నీకు పెళ్లి కాలేదని నా మనసు మాత్రం ఒప్పుకోలేక పోతుంది అని అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు విల్సన్ తన భార్య రాక కోసం బెడ్ పై పువ్వులతో అలంకరిస్తూ ఉంటాడు. అప్పుడే గన్నవరం మందు తాగడానికి పిలుస్తాడు. కానీ విల్సన్ తను రాలేను అని బిజీగా ఉన్నాను అని అంటాడు.


అంత బిజీగా ఏం పని చేస్తున్నావు చెప్పు అనటంతో విల్సన్ చెప్పలేకపోతాడు. అయితే నేనే వచ్చి చూస్తాను అనడంతో వద్దు అని చూడకూడదు అని ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత శిరోజా అక్కడికి రావడంతో నీకోసమే ఈ ఏర్పాట్లు అని అంటాడు. ఈరోజు మన ఫస్ట్ నైట్ అని అంటాడు. దాంతో శిరోజా నువ్వు నాకు నగలు పెట్టే వరకు నేను ముద్దు కూడా పెట్టనని అన్నాను కదా అంటుంది.


ఇక రింగు పెట్టాను అనటంతో చేతులు చూసేసరికి అక్కడ రింగ్ ఉండదు. ఇక శిరోజా నీకోసం నేను మంచం మీద పడుకుంటాను నువ్వు కింద పడుకో అని అంటుంది. ఇక వీల్సన్ చచ్చినట్లు కింద పడుకుంటాడు. ఇక శ్యామ్ భోజనం చేయలేదు అని తెలుసుకున్న రాధ శ్యామ్ దగ్గరికి వెళ్లి ఎందుకు భోజనం చేయలేదు అనటంతో భోజనం చేశాను అని అంటాడు శ్యామ్. ఎందుకు తినకుండా తిన్నారు అని అబద్ధం చెబుతారు అని రాదనటంతో.. కొందరు పెళ్లి కాకుండా కూడా పెళ్లయింది అని అబద్ధం చెబుతున్నారు కదా అని అంటాడు.


దాని తర్వాత మీరు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళను బాధ పెట్టకండి అని అంటుంది. మీరు అలా ఉండటం వల్ల అందరూ బాధపడతారు దయచేసి ఆ విషయం గురించి మర్చిపోండి అని అంటుంది. కానీ శ్యామ్ మాత్రం వినిపించుకోకుండా పెళ్లి గురించి అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా పొరపాటున మీద చెయ్యటంతో తీయు అని అరుస్తుంది రాధ.


వెంటనే శ్యామ్ ఇష్టం లేకుండా చేయి వేస్తేనే అలా అంటున్నావు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నేను ఎలా ఉండాలి అని అంటాడు. ఇక రాధ ఆయన మాటలు పట్టించుకోకుండా తినమని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక బాగా నిద్రలో ఉన్న విల్సన్ ను చూసి గన్నవరం అదోలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక రాళ్లు విసిరేయటంతో అది శిరోజా కు తగులుతుంది.


ఇక శిరోజ తనను ఎవరో రాళ్లతో కొడుతున్నారు అని  అనడంతో వెంటనే విల్సన్ ఈ వంకతో నువ్వు నన్ను కావాలనే లేపడానికి వచ్చావు కదా అని అంటుంటాడు. దాంతో శిరోజా కు బాగా కోపం వస్తుంది. ఇక గన్నవరం దగ్గరికి విల్సన్ వెళ్ళగా గన్నవరం కాస్త తేడాగా ప్రవర్తిస్తుంటాడు కానీ విల్సన్ పసిగట్టలేక పోతాడు. గన్నవరం తనను మరో దానికోసం పిలవటంతో విల్సన్ మాత్రం మందు కోసం పిలుస్తున్నాడేమో అని వెళ్లడానికి సిద్ధమవుతాడు.


ఇక రాధ శ్యామ్ భోజనం చేశాడో లేదో అని చూడగా అక్కడ భోజనం చేయకుండా ఉంటాడు. ఆ తర్వాత పండు ఆకలేస్తుంది అనటంతో శ్యామ్ అన్నం తినలేదు అని అంటుంది రాధ. తరువాయి భాగంలో శ్యామ్ కోయ దొర వేషంలో రాధ దగ్గరికి వెళ్ళగా.. రాధ పండు వైపు చూసి వాళ్ళ నాన్న జాడ చెప్పాలి అనడంతో.. వెంటనే నీ చెయ్యి చూపించు అని అంటాడు శ్యామ్. జాతకం ప్రకారం నీకు ఇంకా పెళ్లి కాలేదు అనటంతో.. రాధ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. తనకు పెళ్లి అయింది అని అంటుంది. నువ్వు కొండ దొర మీద ఒట్టేసి పెళ్లయిందని చెబితేనే పండు వాళ్ళ నాన్న దొరుకుతాడు అని అనటంతో రాధ షాక్ అవుతుంది. అంతేకాకుండా అనుమానం పడుతుంది.


also read : Rangula Ratnam July 21th: ‘రంగులరాట్నం’ సీరియల్: ఆకాష్ వాళ్లు మారారని తెలుసుకున్న శంకర్ ప్రసాద్, ఆవేశంలో నిజాన్ని బయటపెట్టిన రేఖ?


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial