Rangula Ratnam July 21th: ‘రంగులరాట్నం’ సీరియల్: ఆకాష్ వాళ్లు మారారని తెలుసుకున్న శంకర్ ప్రసాద్, ఆవేశంలో నిజాన్ని బయటపెట్టిన రేఖ?

ఆకాష్ వాళ్లు వర్షపై చూపిస్తున్న ప్రేమను చూసి వాళ్ళు మారిపోయారని శంకర్ ప్రసాద్ తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Continues below advertisement

Rangula Ratnam July 21th: దేవ్ సత్యం ఇంటికి వచ్చి శంకర్ కు జరిగిన విషయాల గురించి తెలిసిందని మాట్లాడుతూ ఉంటాడు. సత్యం కూడా తన అల్లుడు మంచివాడు అని అందరం కలిసి పోయాము అని చెబుతాడు. ఇక సీత గురించి మాట్లాడుతూ సీతని చూడాలి అనటంతో సీతను చూడాల్సిందే అని వెంటనే జానకి అంటుంది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అనడంతో దేవ్ సంతోషపడతాడు. తనకు మీటింగ్ ఉందని మళ్లీ కలుస్తాను అని చెప్పి బయలుదేరుతాడు.

Continues below advertisement

మరోవైపు రఘు సిద్ధు ఇంటికి వెళ్లి తమ తండ్రి కనిపించిన విషయం నర్సింగ్ చెప్పాడు అని అంతేకాకుండా ఆనందంలో.. పావనిగా సహాయం చేసింది అమ్మే అని నిజం చెప్పాడు అని అనటంతో నాన్న అమ్మ దగ్గరికి వచ్చి కోపడ్డాడు అని చెబుతాడు. ఇదంతా నా వల్లే జరిగింది అంటే సిద్దు బాధపడతాడు. ఆరోజే డాక్టర్ చెప్పిన వెంటనే రిపోర్ట్స్ తీసుకొని నాన్న దగ్గరికి వెళ్లేసరికి అమ్మ వద్దన్నదని చెబుతాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అని రఘు అంటాడు.

దాంతో సిద్దు కూడా ఈసారి నాన్న  కొట్టిన, తిట్టిన ఆఖరికి చంపిన కూడా డాక్టర్ ని తీసుకువచ్చి నిజం చెప్తానని అంటాడు. మరోవైపు శంకర్ ప్రసాద్ గుడిలో కూర్చొని ఉండగా అక్కడ కొందరు గుడిలో అన్నదానం జరుగుతుంది అనడంతో శంకర్ కూడా ఆకలితో అక్కడికి వెళ్లాలి అని అనుకుంటాడు. ఇక మళ్లీ తను ఏంటి గుడిలో తినడం ఏంటి అని అనుకుంటాడు. మళ్లీ తానే ప్రసాదం కదా అని అక్కడికి వెళ్తాడు.

ఇక గుడి లోపలికి వెళ్లి చూసేసరికి వర్ష పుట్టినరోజు అని ఆకాష్ తన తల్లిదండ్రులతో కలిసి వర్ష ఫోటో ను అక్కడ పెడతారు. ఇక అది చూసి శంకర్ కోపంతో రగిలిపోయి అప్పుడు బాధపెట్టి ఇప్పుడు సంతాపం తెలుపుతున్నారా అని వారిపై కోపాన్ని చూపించే సమయంలో.. వారు ముగ్గురు వర్ష మీద ఉన్న చూపిస్తూ కోల్పోయినందుకు బాధపడుతూ. గతంలో తాము ఎంతో బాధ పెట్టిన కూడా అవన్నీ తట్టుకొని వారిని మంచి మనుషులుగా మార్చింది అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు.

దాంతో శంకర్ ఆకాష్ వాళ్లు మారిపోయారు అని తెలుసుకొని అక్కడి నుండి వెళ్తుండగా ఆకాష్ శంకర్ ప్రసాద్ ని చూసి ఆపి మాట్లాడుతాడు. ఇదంతా చూడటానికేనా నా కళ్ళు వచ్చాయి అని గుడ్డివాడిగా ఉంటే బాగుండేది అనటంతో.. అలా చూడటం ఇష్టం లేక వర్ష కళ్ళు ఇచ్చింది అనటంతో శంకర్ ప్రసాద్ షాక్ అవుతాడు. చాలా బాధపడతాడు.

తరువాయి భాగంలో వర్ష రేఖ దగ్గరికి వచ్చి ఎందుకు మా అత్తయ్యను అంత బాధ పెడుతున్నావు. తను కూడా నీలాగే ఒక ఆడదే కదా అనటంతో వెంటనే రేఖ శంకర్ తనని నమ్మకుండా తన గుండెని రాయిని చేసింది నేనే అంటూ చెప్పటంతో వెంటనే శంకర్ ప్రసాద్ ఆ మాటలు విని షాక్ అవుతాడు.

also read : Trinayani July 21th: ‘త్రినయని’ సీరియల్: అఖండస్వామిని పిచ్చోడిని చేసిన తిలోత్తమా ఫ్యామిలీ, అత్త ఆలోచనలను మార్చిన హాసిని?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement