చిన్నోడు vs పెద్దోడు - ‘గుంటూరు కారం’తో ‘సైంధవ్’ పోటీపై స్పందించిన వెంకటేశ్
వెంకటేశ్ హీరోగా నటించిన 75వ చిత్రమే ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. తన కూతురిని కాపాడుకోవడం కోసం రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను సంపాదించడానికి హీరో వెళ్తాడని, అదే సమయంలో తనకు ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉందని బయటపడుతందని ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించాడు దర్శకుడు. ఇక సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీపడడానికి ‘సైంధవ్’ సిద్ధమయ్యింది. మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల అవుతుండగా.. ఒక్కరోజు గ్యాప్‌లో ‘సైంధవ్’ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో థియేటర్లు లేకపోవడంపై వెంకటేశ్ స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా
ఇప్పుడు లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) మెగా కోడలు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)తో గత ఏడాది నవంబర్ 1న ఏడడుగులు వేశారు. మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారు. మరి, పెళ్లి తర్వాత లావణ్య నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఏదో తెలుసా? 'మిస్ పర్ఫెక్ట్'. అవును... మిసెస్ అయిన తర్వాత 'మిస్'గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. శ్రీమతి అయ్యాక తాను కుమారి అంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్ ఇదే - దున్నపోతు డైలాగ్ వైరల్ అయ్యేలా ఉందిగా
కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ సినిమాలు చేసి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) విజయాలు అందుకున్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అయితే హిందీలో ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్ చేయడం వల్ల తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం వచ్చింది. ఇప్పుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘హనుమాన్’ మూవీ నుంచి ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదల
సంక్రాంతి బరిలో దిగనున్న ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య కంటెంట్ మీద నమ్మకంతో ఒక సూపర్ హీరో సినిమా కూడా విడుదల కానుంది. అదే ‘హనుమాన్’. ఒక యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. జనవరి 12న విడుదల కానుంది. అందుకే మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఓవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మ, మరోవైపు హీరో తేజ సజ్జా.. తమ సినిమా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ‘హనుమాన్’ నుండి ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదలయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మనోజ్ బాజ్ పేయి ‘కిల్లర్ సూప్’ ట్రైలర్ - ఇదో డార్క్ క్రైమ్ స్టోరీ
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నార్త్ తో పాటూ సౌత్ లోనూ విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే రెండు సీజన్స్ రిలీజ్ అవ్వగా త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతోంది. ఫ్యామిలీ మెన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మనోజ్ బాజ్ పాయ్ కి అవకాశాలు క్యూ కట్టాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)