కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ సినిమాలు చేసి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) విజయాలు అందుకున్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అయితే హిందీలో ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్ చేయడం వల్ల తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం వచ్చింది. ఇప్పుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వెల్లడించారు.
'టైసన్ నాయుడు'గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Tyson Naidu Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'టైసన్ నాయుడు' టైటిల్ ఖరారు చేశారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. ఇందులో ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆయన సినిమా రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ''సార్... బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?'' అని ఒకరు ప్రశ్నిస్తే... ''దున్నపోతు చచ్చిపోతుంది'' అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం చెబుతారు. ఆ డైలాగ్ వైరల్ అయ్యేలా ఉంది. పంజాబ్, సిక్కుల నేపథ్యంలో సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర 'టైసన్ నాయుడు' సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
Also Read: ఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున
ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: విజయ్ - వెంకట్ - 'రియల్' సతీష్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్, ఛాయాగ్రహణం: ముకేశ్ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.