Ed Raids In Jarkhand : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు...రాజస్థాన్( Rajastan), జార్ఖండ్ (Jarkhand)రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) సన్నిహితుడు, మీడియా సలహాదారు అభిషేక్‌ ప్రసాద్‌(Abhishek Prasad) ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్‌, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. 


సాహిబ్ గంజ్ కలెక్టర్ కు నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. జార్ఖండ్, రాజస్థాన్‌లో ఆయనకు ఇళ్లు ఉన్నాయి. అక్కడ తనిఖీలు చేస్తున్నారు. హజారీబాగ్ డీఎస్పీ రాజేంద్ర దూబె నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.


జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ కు మనీలాండరింగ్‌ కేసుతో సంబంధముందని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జార్ఖండ్ కోర్టును ఆశ్రయించాలని హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు సూచించింది. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని, లేని పక్షంలో చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఈడీ హెచ్చరించింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సోరెన్ ను ఇప్పటికే ప్రశ్నించింది. 


బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు
మరోవైపు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్...ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, ఆ కుర్చీలో  భార్య క‌ల్ప‌న‌ సోరెన్ కు అప్ప‌జెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ అందిన వెంటనే స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేప‌థ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత దూబే వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త సంతరించుకుంది. మరోవైపు హేమంత్ సోరెన్‌పై ఈడీ ఇప్ప‌టికే మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది. విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా సీఎం పదవికి రాజీనామా చేసి...భార్యకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 


బీజేపీకి కౌంటర్ ఇచ్చిన హేమంత్ సోరెన్
జేపీ ఎంపీ నిషికాంత్ దూబే(Nishikant Dubey) వ్యాఖ్యలకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కౌంటర్ ఇచ్చారు. తన సతీమణి కల్పన(Kalpana)కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారంటూ...బీజేపీ(BJP) తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశమే లేదని...అలాంటపుడు మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యలు ఎలా అప్పగిస్తానని ప్రశ్నించారు. సర్ఫరాజ్ అహ్మాద్(Sarfaraz Ahmed) ప్రాతినిధ్యం వహించిన గాండెయ (Gandeya) అసెంబ్లీ నుంచి కల్పనా పోటీ చేస్తారన్న కామెంట్స్ ను కొట్టి పారేశారు. తనపై, ప్రభుత్వంపై బీజేపీ కట్టుకథలు అల్లుతోందని, ప్రజలన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రానికి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ 2019, డిసెంబ‌ర్ 27న ఏర్పాటైంది. భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు జేఎంఎం ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ సమావేశం కానున్నారు. 


Also Read: అచ్చెన్నాయుడుపై ఐఏఎస్..! ఇచ్ఛాపురంలో పోటీకి మహిళా నేత...! శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ వ్యూహం ఇదే...!


Also Read: మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీ - ఈసీ ముఖేష్ కుమార్‌ ఉత్తర్వులు