Japan Flight Cathces Fire: జపాన్(Japan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోక్యో( Tokyo)లోని హనేడా ఎయిర్ పోర్ట్(Haneda Airport) లో ల్యాండ్ అవుతున్న ఎయిర్ బస్(Air Bus) 350 విమానం మరో కోస్ట్ గార్డ్(Coast Guard) ఎయిర్ క్రాఫ్ట్(Air Craft) ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చూస్తుండగానే ఎయిర్ బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరుగుతున్న టైమ్ లో విమానంలో 379 మంది ప్రయాణికులు ఉన్నారు. న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ ఎయిర్ లైన్స్ విమానం హనేడా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇంతటి ఘోర ప్రమాదంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చనిపోలేదు. రీజన్ ఏంటో తెలుసా జపాన్ ప్రజల డిస్ప్లైన్ అండ్ కాన్షియెస్ నెస్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్.
1. ల్యాండ్ అవుతున్న విమానం ఇదిగోండి ఈ బొమ్మ లో చూపించినట్లు పక్కనే ఆగి ఉన్న ఫ్లైట్ ఢీకొట్టడంతో మొత్తం మంటలు వ్యాపించాయి. కానీ ఫ్లైట్ లో ఉన్న వారెవరూ భయపడొద్దని క్యాబిన్ క్రూ అనౌన్స్ చేశారు.
2. ఎవ్వరూ ప్రాణభయంతో లేచి హడావిడి వాతావరణం సృష్టించలేదు. జనరల్ విమానాల్లో చేసే మొదట పని తల పైన ఉండే క్యాబిన్ లో ఉన్న లగేజీ లాక్కోవాలి అని కానీ వీళ్లెవరూ ఆ పని చేయలేదు.
3. ఫ్లైట్ ల్యాండింగ్ స్పీడ్ తగ్గగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశారు. మంటలు లేని వైపు నుంచి రన్ వే మీదకు ఇలా జారుకుంటూ దిగేశారు.
4. ముందుగా కిందకి దిగేసిన ప్రయాణికులు తమ వెనుక వస్తున్న వారికి హెల్ప్ చేశారు. వాళ్ల చేతులు పట్టుకుని వాళ్లను కూడా కిందకు లాగేశారు. అందరూ ఆ విమానం పేలిపోయే ప్రమాదం ఉంది కనుక దూరంగా పరుగులు పెట్టారు. ఇదంతా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్..కాన్షియెస్ నెస్ విత్ హ్యూమానిటీ..
5. ఇక ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లైన్. మనకు కనిపిస్తున్న ఈ వీడియోలన్నీ ఎయిర్ పోర్ట్ నుంచి మీడియా వాళ్లు తీసినవి.ఫ్లైట్ లో ఉన్న క్యాబిన్ క్రూలో ఒకరు తీసినవి తప్ప ఎవ్వరి చేతిలో మొబైల్ ఫోన్లు లేవు. వాళ్లెవరూ ఫోన్లతో జరుగుతున్న ఘటనను రికార్డ్ చేసే ప్రయత్నం చేయలేదు. ముందుగా ఆ డిసి ప్లైన్ ను అప్రిషియేట్ చేయాలి. మనం అప్రమత్తతతో ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఫైర్ ఫైటింగ్ చేయగలం. ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అయ్యారు కాబట్టే విమానం మొత్తం తగలబడిపోయినా కేవలం 15మంది అది కూడా చిన్నపాటి గాయాలతో ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడగలిగారు.