Japan Airlines Catches Fire After Collision With Coast Guard Plane: టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో ఎయిర్ పోర్టు (Tokyo Airport)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానం టోక్యోలోని హనేడా ఎయిర్ పోర్టు (Haneda Airport)లో రన్‌ వేపై దిగుతుండగా ప్రమాదానికి గురైంది. అయితే కోస్ట్ గార్డ్ విమానం, జేఎల్ 516 విమానాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ నుంచి జపాన్ ఎయిర్ లైన్స్ విమానం హనేడా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  రెండు విమానాలు ఢీకొనడంతో టోక్యో ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.


Twitter Photo 


ప్రమాదం జరిగిన ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణికులును కిందకి దించివేయడంతో ప్రాణనష్టం తప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ సమయంలో  జేఏల్‌ 516 విమానంలో 379 మంది ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది అందులో ఉన్నారని సమాచారం.



హక్కైడోలోని షిన్-చిటోస్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానంలో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారని జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. స్థానిక NHK మీడియా ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించివేయడంతో ప్రాణ నష్టం తప్పింది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఏమన్నారంటే.. విమానం హక్కైడోలోని షిన్-చిటోస్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానంలో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. 


కాలిపోయిన విమానం.. 


ఎయిర్ పోర్ట్ రన్‌వే మొత్తం మంటలతో నిండిపోయిందని, విమానం కాలిపోయిందని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. విమానం హనేడా విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగిందని బీబీసీ నివేదికలో పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో హనేడా ఒకటి. ఆ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం జరగడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ లకు కష్టమవుతోంది.