ఇప్పుడు లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) మెగా కోడలు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)తో గత ఏడాది నవంబర్ 1న ఏడడుగులు వేశారు. మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారు. మరి, పెళ్లి తర్వాత లావణ్య నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఏదో తెలుసా? 'మిస్ పర్ఫెక్ట్'. అవును... మిసెస్ అయిన తర్వాత 'మిస్'గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. శ్రీమతి అయ్యాక తాను కుమారి అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య
లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. దీనికి విశ్వక్ ఖండే రావు దర్శకుడు. ఇంతకు ముందు 'స్కైలాబ్' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ రోజు 'మిస్ పర్ఫెక్ట్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లుక్ షేర్ చేసిన లావణ్య ''పర్ఫెక్ట్ నోట్‌తో న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తున్నా. మిస్ పర్ఫెక్ట్ సార్... మిస్ పర్ఫెక్ట్ అంతే'' అని ట్వీట్ చేశారు. 'అల వైకుంఠపురములో' సినిమాలో 'మేడమ్ సార్ మేడమ్ అంతే' అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తు వచ్చేలా చేశారు. 


Also Readమహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?






లావణ్యకు జోడీగా అభిజిత్...
ప్రధాన పాత్రలో అభిజ్ఞ వుతలూరు
'మిస్ పర్ఫెక్ట్' ఫస్ట్ లుక్ చూశారా? అందులో 'బిగ్ బాస్' ఫేమ్, ఆ షో కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోగా నటించిన అభిజిత్ కూడా ఉన్నారు. ఈ సిరీస్‌లో లావణ్యా త్రిపాఠికి జోడీగా ఆయన కనిపించనున్నారు. ఇంకా ఆ లుక్ చూస్తే అభిజ్ఞ కూడా ఉన్నారు. ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్.


Also Readఆ ఓటీటీలో, టీవీలో 'నా సామి రంగ'... డీల్ సెట్ చేసిన కింగ్ నాగార్జున



రొమాన్స్ అండ్ కామెడీ... ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 
రొమాంటిక్ కామెడీగా లావణ్య త్రిపాఠి, అభిజిత్ (Bigg Boss Abhijeet) వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్‌లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుందని, వీక్షకులకు ఓ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని సమాచారం. త్వరలో ఈ సిరీస్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


'మిస్ పర్ఫెక్ట్' లావణ్య త్రిపాఠికి రెండో వెబ్ సిరీస్. దీని కంటే ముందు 'జీ 5' ఓటీటీ కోసం 'పులి మేక' వెబ్ సిరీస్ చేశారు. అందులో ఆమెది పోలీస్ రోల్. ప్రజెంట్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే... ఇందులో ఆమె కార్పొరేట్ బాస్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.