David Warne :ముందంతా టెస్టు క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకోనున్నట్టు ప్రకటించిన డేవిడ్ వార్నర్ (David Warner) అకస్మాత్తుగా వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జనవరి 3 (ఈరోజు ) నుంచి సిడ్నీ(Sydney) వేదికగా పాకిస్తాన్(Pakistan)తో జరుగబోయే పింక్ టెస్టుకు ముందు వార్నర్ మాట్లాడుతూ తన కెరియర్లో భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కున్నఈ ఆసీస్ స్టార్ ఓపెనర్.. సౌతాఫ్రికా(South Africa) మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Stein ) తనను బాగా భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్(Ausis) పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్ అయితే తమకు చుక్కలు చూపించిందని, . ఆ సందర్భంలో మార్ష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెప్పాడు.
చివరి టెస్ట్‌కు సిద్ధమైన వార్నర్
ఆస్ట్రేలియా(Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) కొత్త సంవత్సరం తొలి రోజున..తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్(Test Cricket)కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ ఇప్పుడు వన్డే(ODI cricket)లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్(Bharat)పై వన్డే ప్రపంచకప్(ODI World Cup2023 ) గెలిచిన ఈ మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం తాను కొనసాగుతానని డేవిడ్ భాయ్ స్పష్టం చేశాడు. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన క్రికెట్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న.. జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. తన సొంత మైదానంలో మంచి ప్రదర్శన చేసి టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. చివరి టెస్ట్ ఆడనున్న వేళ వార్నర్ (David Warner)పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. వార్నర్ అద్బుతమైన ఆటగాడన్న మెక్‌డొనాల్డ్... జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతుండడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బని ఆండ్రూ అన్నాడు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు వార్నర్ ఎంపిక చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయన్న ఆసిస్ కోచ్....వాటన్నింటికీ డేవిడ్ భాయ్ తొలి టెస్ట్‌తోనే సమాధానం చెప్పాడని అన్నాడు. ఏదైమైనా వార్నర్ స్థానాన్ని భర్తీ చేయడం తమకు చాలా కష్టమని అంగీకరించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడని గుర్తు చేశాడు.