టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది ఇప్పటికే టీ20, సిరీస్ ను పూర్తి చేసుకుంది. మూడు మ్యాచుల టి20 సిరీస్ 1-1 తో డ్రా కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ అనంతరం ప్రారంభమైన రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది.


ఇన్నింగ్స్ 32 పరుగులు తేడాతో జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు పరిమితమైంది. జట్టులో విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) రాణించగా, కేఎల్ రాహుల్ ఒక్కడే 101 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 5 వికెట్లను తీసుకొని భారత జట్టు పతనాన్ని శాసించాడు. బర్గర్ 3 వికెట్లు, మార్కో జాన్సన్, కోటిజో ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు భారీగా పరుగులు సాధించింది. ఆ జట్టు ఆటగాడు ఎల్గర్ భారీ శతకంతో (185) చెలరేగిపోగా, టోనీ డి జోర్జి (28), బెడింఘం (56), మార్కో జాన్సన్ (84) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు పది వికెట్ల నష్టానికి 408 పరుగులను చేసింది.


అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తడబాటుకు గురైంది. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో 131 పరుగులకే కుప్ప కూలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా విరాట్ కోహ్లీ (76) రాణించడంతో ఆమాత్రమైన పరుగులు చేయగలిగింది. సుబ్ మన్ గిల్ (26), కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరు రెండంకెల స్కోర్ చేయలేకపోయారంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత దారుణంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ నాలుగు, మార్కో జాన్సెన్ మూడు, రబాడ రెండు వికెట్ల తీసి భారత పతనాన్ని శాసించారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి టెస్ట్ లో పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది.


దెబ్బకు దెబ్బ తీస్తారా..


తొలి టెస్ట్ లో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవడం కోసం  భారత జట్టు రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది. కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ వేదికగా బుధవారం రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈమె లక్ష్యంగా భారత జట్టు లోకి దిగుతోంది. ఇందుకోసం స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి విలువల్లాడిన భారత బాటర్లు రెండో టెస్టులో వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై  దృష్టి సారించి నెట్స్లో చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా మొదటి టెస్టులో భారత జట్టు ఒక ఆటగాళ్ళ ను వివిలియన్ బాట పట్టించిన బర్గర్, రబాడాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుగుణమైన ప్రణాళికలను భారత జట్టు సిద్ధం చేస్తోంది.


ఎడమ చేతి వాటం బౌలర్ అయిన బర్గర్ ను ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశంతో భారత బ్యాటర్లు నెట్స్ లో ఎడమ చేతి వాటం బౌలర్లతో బౌలింగ్ చేయించుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి టెస్ట్ లో బ్యాటర్లు ఎక్కడెక్కడ తప్పిదాలు చేశారు వాటిని సరిదిద్దుకునేలా ఎక్కువ సమయాన్ని ప్రాక్టీస్ కు కేటాయిస్తున్నారు. రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తే తొలి ఇన్నింగ్స్ లో ఒకటిన్నర రోజు పాటు బ్యాటింగ్ చేసేలా భారత జట్టు సన్నద్ధమవుతోంది. ముందుగా వికెట్లు పడకుండా దక్షిణాఫ్రికా బౌలర్లపై ఒత్తిడి పెంచడం ద్వారా రెండో టెస్ట్ పై పట్టు బిగించవచ్చని భారత జట్టు భావిస్తోంది. ముఖ్యంగా జట్టులోని కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి నుంచి భారీగా పరుగులు వస్తే రెండో టెస్ట్ పై పట్టు బిగించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్న సమయంలో.. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. బౌలర్లు తమకున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించి మరింత సమర్థవంతంగా రాణిస్తే రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించేందుకు అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని బౌలర్లు బంతులు సంధిస్తే రెండో టెస్టులో భారత గట్టు విజయం సాధించడం ద్వారా సిరీస్ ను సమం చేసే అవకాశం వుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.