మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో... పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనేది టైటిల్. చైనీస్ భాషలో విడుదల చేయాలని తీశారు. దానిని హిందీలో 'లడకీ' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులోకి 'అమ్మాయి' పేరుతో తీసుకువస్తున్నారు.


'అమ్మాయి' సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్టు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో అదే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థలు ఆర్ట్ సి మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, బిగ్ పీపుల్ తెలిపాయి. హిందీ, చైనీస్ భాషల్లో  త్వరలో విడుదల కానుంది.
రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను బ్రూస్ లీకి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. 'అమ్మాయి' చైనీస్ వెర్షన్ 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' చిత్రాన్ని చైనాలో 20 వేల థియేటర్లలో విడుదల చేయడానికి చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. చైనాలో నవంబర్ 27న బ్రూస్ లీ 81వ పుట్టిన రోజు సందర్భంగా ఫోషన్ కుంగ్ ఫు చలన చిత్రోత్సవాల్లో సినిమాను ప్రదరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అలాగే, బుర్జ్ ఖలీఫా భవనం మీద 'అమ్మాయి' చిత్రం మొదటి ప్రపంచ ప్రోమోని చూపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి రవి శంకర్, డి.ఎస్.ఆర్ సంగీతం అందించారు.
Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: హైద‌రాబాద్‌ మెట్రోలో జాగ్రత్త... బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు!
Also Read: కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
Also Read: అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి