నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వంద సినిమాలు వచ్చినా ప్లాప్ అవ్వవని, వాళ్లిద్దరి మధ్య అంత మంచి అండర్ స్టాండింగ్ ఉంటుందని సంగీత దర్శకుడు అన్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా 'అఖండ' డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమన్ మీడియాతో మాట్లాడారు.


'అఖండ'లో బాలయ్యగారు అదరగొట్టేశారని, అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ మీల్‌ లాంటి సినిమా అని తమన్ అన్నారు. ఇందులో మంచి ఎమోషన్ ఉందన్నారు. నేపథ్య సంగీతం కోసం అఘోరలపై రీసెర్చ్ చేశానని, ఆ పాత్రలకు తగ్గట్టుగానే నేపథ్య సంగీతం అందించానని తమన్ తెలిపారు. అఘోరా పాత్ర వచ్చిన తర్వాత సినిమా రేంజ్ మారుతుందని చెప్పారు. 'అఖండ'తో అఘోరాల గురించి ప్రేక్షకులకు ఓ స్పష్టత వస్తుందన్నారు. శివుడి నేపథ్యంలో శంకర్ మహదేవన్ ఎక్కువ పాటలు పాడారు కనుక ఆయనతో 'అఖండ' టైటిల్ సాంగ్ పాడించానని తెలిపారు.


కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు మళ్లీ రీ-రికార్డింగ్ చేశానని తమన్ చెప్పారు. టైటిల్ సాంగ్ విని బాలకృష్ణగగారు అప్రిషియేట్ చేశారని తమన్ సంతోషం వ్యక్తం చేశారు. 'అఖండ' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.





Also Read: బ్రేకింగ్ న్యూస్... సుబ్బరాజు, జె.డి. చక్రవర్తితో రెజీనా సినిమా... షూటింగ్ షురూ
Also Read: సుమ సినిమాలో ఓ ప్రేమ పాట... ఎవరి మీద తీశారు? ఎవరు విడుదల చేశారంటే?
Also Read: సినిమాతో పాటు దర్శకుడి మాటలు వినిపిస్తే? ఇండియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దేవ్ కట్టా 'రిపబ్లిక్'
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి