హమ్మయ్య..! దలాల్‌ స్ట్రీట్‌లో నష్టాలకు కాస్త తెరపడింది! వరుస సెషన్లలో పతనమైన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొంత లాభాల్లోనే ముగిశాయి. మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ కనిపించింది.


సోమవారం 58,465 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు 57,983 వద్ద గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. ఉదయం మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనైంది. ఇంట్రాడే కనిష్ఠమైన 57,718ని తాకిన సూచీ కాసేపైన తర్వాత కొనుగోళ్లు ఆరంభం కావడంతో ఇంట్రాడే గరిష్ఠమైన 58,834ను అందుకుంది. చివరికి 198 పాయింట్ల లాభంతో 58,664 వద్ద ముగిసింది. ముందు రోజు 17,416 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 17,281 వద్ద మొదలైంది. ఇంట్రాడే కనిష్ఠమైన 17,216ను తాకి మెరుగై 17,553ను అందుకుంది. మొత్తంగా 86 పాయింట్ల లాభంతో 17,503 వద్ద ముగిసింది.


నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్ప్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఆసియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, విప్రో నష్టాల్లో ముగిశాయి. ఐటీని మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. పవర్, మెటల్‌, రియాలిటీ, ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్‌లు ఒకటి నుంచి మూడు శాతం వరకు రాణించాయి.






Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?


Also Read: EPFO New Update: జాబ్‌ మారారా? పీఎఫ్‌ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!


Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ


Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్‌ పతనానికి కారణాలివే..!


Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..


Also Read: Rohit Sharma on Venkatesh Iyer: వెంకటేశ్‌ అయ్యర్‌పై రోహిత్‌ కీలక స్టేట్‌మెంట్‌..! మరింత ఫోకస్‌ పెడతామంటున్న కెప్టెన్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి