ఇటు ఇల్లాలు... అటు ప్రియురాలు... తెలుగులో ఈ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. హిందీలో కూడా వచ్చాయి. పెళ్లాం... ప్రియురాలు... భర్త ఎవ‌ర్‌గ్రీన్‌ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద హిందీలో కొత్తగా ఓ సినిమా రూపొందుతోంది. అందులో విక్కీ కౌశల్ హీరో. కియారా అడ్వాణీ, భూమి పెడ్నేకర్ హీరోయిన్లు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'గోవింద్ మేరా నామ్' టైటిల్ ఖరారు చేశారు. సినిమా వివరాల్ని ఈ రోజు వెల్లడించారు.






గోవింద్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా... అతడి భార్య పాత్రలో భూమి పెడ్నేకర్, నాటీ గాళ్ ఫ్రెండ్ పాత్రలో కియారా అడ్వాణీ కనిపించనున్నారు. సినిమా ప్రకటించిన రోజునే విడుదల తేదీ కూడా చెప్పారు. వచ్చే ఏడాది జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'హంప్టీ శ‌ర్మ కి దుల్హ‌నియా', 'బ‌ద్రీనాథ్ కి దుల్హ‌నియా', 'ధ‌డ‌క్' సినిమాల త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో మరోసారి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.


'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన కియారా అడ్వాణీ, ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' చేశారు. హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ కు జోడీగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.


Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
Also Read: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి