అన్వేషించండి

Naga Chaitanya: మత్స్యకారుల వద్దకు హీరో నాగ చైతన్య, సడెన్‌గా రావడంతో ఎగబడ్డ జనం

ఒక్కసారిగా స్థానికులు నాగ చైతన్య ను చూసేందుకు ఎగబడ్డారు. నాగ చైతన్యతో ఫోటోలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు.

మత్య్సకారుల జీవన ముఖ చిత్రం ఇతి వృత్తంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం హీరో అక్కినేని నాగ చైతన్య సిక్కోలు తీరంలో సందడి చేశారు. ఈ మేరకు ఎచ్చెర్ల రూరల్ డి. మత్య్సలేశం తీర ప్రాంతానికి డైరక్టర్ చందూ మొండేటి, ప్రొడ్యూసర్ బన్ని వాసుతో హీరో అక్కినేని నాగ చైతన్య చేరుకున్నారు. సినిమాల్లో కనిపించే హీరో ఒక్క సారిగా తమ తీర ప్రాంతానికి రావడంతో మత్య్సకారుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఒక్కసారిగా వారంతా నాగ చైతన్య ను చూసేందుకు ఎగబడ్డారు. నాగ చైతన్యతో ఫోటోలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు.

భద్రత సిబ్బంది ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ వారంతా తమ అభిమాన నటుడిని చూసేందుకు, మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ముందుగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డైరక్టర్ చందూ మొండేటి, ప్రొడ్యూసర్ బన్ని వాసు, హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడారు. నాగ చైతన్య మాట్లాడుతూ.. గత ఆరు నెలల క్రితం దర్శకుడు చందు మొండేటి మత్య్సకారుల జీవన విధానంపై కథ వినిపించారని మనస్సుకు ఎంతో బాగా నచ్చి ఈ ప్రాజెక్టు చేయాలని భావించానని అన్నారు. మత్య్సకారుల జీవన విధానం తెలుసుకునేందుకు సిక్కోలు తీర ప్రాంతం డి. మత్య్పలేశం గ్రామానికి వచ్చానని నాగచైతన్య తెలిపారు. బన్ని వాస్ మాట్లాడుతూ నిజ జీవితంలో జరిగిన యదార్థ గాధను ఇతి వృత్తంగా చేసుకొని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించామని వెల్లడించారు.

నాగచైతన్య తన తర్వాతి సినిమా పనుల్లో బిజీ అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో మత్స్యకారుల వెతలపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు.

2024లో పక్కా ప్లానింగ్‌తో నాగ చైతన్య

నాగ చైతన్య రీసెంట్ గా నటించిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి పక్కా ప్లానింగ్ తో వచ్చి హిట్లు అందుకోవాలని చూస్తున్నారు చైతన్య. అందుకే తనకు మంచి హిట్ లు అందించిన శివ నిర్వాణ, చందూ మొండేటి లతో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే జాలర్ల నేపథ్యంలో చందూ మొండేటితో ఒక పాన్ ఇండియా లెవల్ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘ప్రేమమ్’ సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగానే తాజాగా శ్రీకాకుళానికి వచ్చి మత్స్యకారులను కలిశారు. 

ఇక ఈ సినిమాతోపాటు తనకు ‘మజిలీ’ లాంటి క్లాసిక్ హిట్ ను అందించిన శివ నిర్వాణతో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని సమాచారం. నాగ చైతన్య, సమంత కలసి నటించిన ‘మజిలీ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ కాంబో పై కూడా మరోసారి ఉత్కంఠ నెలకొంది. త్వరలో ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుందని టాక్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
CAT 2024: 'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget