క్రికెట్‌ సెలెబ్రిటీలంతా 'పుష్ఫ' మేనియాలో పడ్డారు. పుష్ఫ పోస్టర్లు, వీడియోలు, ఆడియోలను రీక్రియేట్‌ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, డేవిడ్‌ వార్నర్‌ 'తగ్గేదే లే' అంటూ అలరించారు. ఇప్పుడు క్రికెటర్ల పిల్లలు సైతం 'పుష్ఫ' పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు.


సాధారణంగా డేవిడ్‌ వార్నర్‌ కుటుంబమంతా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. వార్నర్‌ అతడి సతీమణి క్యాండిస్‌ కలిసి ఎన్నో వీడియోలు చేసి అలరించారు. వారి పిల్లలు కూడా అప్పుడప్పుడు వీడియోల్లో కనిపిస్తుంటారు. తాజాగా డేవిడ్‌ వార్నర్‌ పిల్లలు 'పుష్ఫ' సినిమాలోని 'రారా సామి.. నా సామి.. బంగారు సామి.. మీసాల సామి' పాటకు డ్యాన్స్‌ చేశారు. స్విమ్‌ సూట్లో వారు చేసిన స్టెప్పులు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.






ఇంతకు ముందే డేవిడ్‌ భాయ్‌ 'పుష్ఫ'గా అలరించిన సంగతి తెలిసిందే. ‘శ్రీవల్లి’ స్టెప్‌తో ఫ్యాన్స్‌ను మరోసారి ఫిదా చేశాడు. అయితే సాధారణంగా డేవిడ్ వార్నర్ ఎప్పుడూ తెలుగు వెర్షన్‌నే ఎంచుకుంటాడు. కానీ శ్రీవల్లి సాంగ్‌కు మాత్రం ఈసారి కన్నడ ఆడియోతో ఈ వీడియోను విడుదల చేశాడు.


డేవిడ్ వార్నర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో పోటీ పడనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి తగినట్లు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల మధ్య కూడా ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. ఈ వార్తలు నిజం అవుతాయో లేకపోతే వార్నర్‌ను మరో ఫ్రాంచైజీ ఎగరేసుకుపోతుందో వేచి చూడాలి మరి!


Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 


Also Read: IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!


Also Read: Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!