Aadi Sai Kumar's Shambhala Teaser Released: టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'శంబాల'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్స్, మేకింగ్ వీడియో భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
సైన్స్‌కు అంతుపట్టని రహస్యం
'ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా స్టోరీపై ఆసక్తి అమాంతం పంచేసింది. 'పంచ భూతాలను శాసిస్తున్న ఇది సాధారమైనది కాదు.. ఈ రక్కసి క్రీడను ఆపాలంటే..' అంటూ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ కొత్త ప్రపంచం.. సూపర్ నేచురల్ వరల్డ్‌లోకి తీసుకెళ్తోందని అర్థమవుతోంది.
స్టోరీ అదేనా..
ఒక్క మనిషి కూడా లేని గ్రామం, సైకిల్‌పై పాల క్యాన్ కిందపడి ఒలికిపోయిన వైనం.. ఆ పాల్లలో రక్తం కలిసినట్లు, వాటిని ఓ కుక్క తాగుతున్నట్లు భయంకరంగా చూపించిన పోస్టర్‌లోనే ఈ మూవీ ఓ హారర్ థ్రిల్లర్ అని అర్థమైంది. భయంకరంగా ఘర్జిస్తోన్న ఆకాశం, పెను ప్రళయాన్ని ముందు భీకర పరిస్థితిని ఒక్క పోస్టర్‌లోనే చూపించగా.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ అంతకు మించి అనేలా ఉంది.
అంతరిక్షం నుంచి ఏదో ఓ అతీంద్రయ పవర్ ఉన్న రాయి వంటిది ఓ గ్రామంలో పడడం.. అప్పటి నుంచీ ఆ ఊరిలో జరిగే భయంకర పరిణామాలు టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఆ రాయి ప్రభావంతో గ్రామంలో ప్రజలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం చూస్తుంటే సైన్స్‌కు అందని అంతుచిక్కని రహస్యాలను మూఢ నమ్మకాలకు ముడిపెట్టినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించబోతున్నారు. గ్రామంలో రాయి మిస్టరీ ఛేదించేందుకు చేసిన ప్రయత్నాలు.. మూఢ నమ్మకాలు అలుముకున్న ఊరిలో గ్రామస్థులతో పోరాటం అన్నింటినీ ఆసక్తికరంగా చూపించారు. ప్రవీణ్ కే బంగారి విజువల్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల బీజీఎం వేరే లెవల్‌లో ఉంది.
ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించే ఆది సాయికుమార్ 'శంబాల'తోనూ కొత్తగా ముందుకొస్తున్నారు. విజువల్స్, టీజర్‌తో మూవీపై అంచనాలు భారీగా పెంచేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నారు.