'భైరవం' రిలీజ్ రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఆ మూవీ చూడటానికి వచ్చిన ఆడియన్స్ కన్నా 'ఖలేజా' రీ రిలీజ్ చూడటానికి వచ్చిన ఆడియన్స్ ఎక్కువ. ఆ విషయం హీరో మంచు మనోజ్, 'భైరవం' ప్రొడ్యూసర్ రాధామోహన్ యాక్సెప్ట్ చేశారు. రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. కానీ విష్ణు మంచు 'ఢీ' రీ రిలీజ్‌కు మాత్రం అంతా రివర్స్‌లో జరుగుతోంది. టికెట్లు తెగక మల్టీప్లెక్స్ స్క్రీన్లు వెలవెలబోతున్నాయి.

ప్రసాద్స్‌కు విష్ణు వెళ్ళలేదు...థియేటర్లలో జనాలు కూడా లేరు!?ఫ్రైడే 'ఢీ' రీ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ సిటీ అంతటా మల్టీప్లెక్స్‌లలో ప్రైమ్ టైంలో షోలు షెడ్యూల్ చేశారు. అయితే ఆడియన్స్ లేక కొన్ని చోట్ల క్యాన్సిల్ చేశారని టాక్. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో నైట్ 7.50 షోకి వస్తానని, పది టికెట్లు పక్కన పెట్టమని విష్ణు ట్వీట్ చేశారు. అయితే ఆ షోకి ఆయన వెళ్ళలేదు. విష్ణు వస్తారని కొందరు వెళితే థియేటర్ ఖాళీగా కనిపించిందట. పట్టుమని 50 టికెట్లు కూడా తెగలేదట. 

వీకెండ్ అని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో షో షెడ్యూల్ చేశారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు రెండు అంటే రెండు టికెట్స్ మాత్రమే తెగాయి. కూకట్‌పల్లి నెక్సస్‌ మాల్‌లోని పీవీఆర్‌లో ఆదివారం నైట్‌ 10.30కి షో షెడ్యూల్ చేశారు. అది కాస్త బెటర్. ఆ షోకి 50 ప్లస్ టికెట్స్ తెగాయి.

Also Read: అఖిల్ పెళ్లి చేసిన కొన్ని గంటల్లో డబ్బింగ్ థియేటర్‌కు వెళ్లిన నాగార్జున... ఎందుకో తెలుసా?

మండే నుంచి పసాద్స్ లో సినిమా వేయడం లేదు. కూకట్‌పల్లి నెక్సస్‌ మాల్‌లో పీవీఆర్‌లో నైట్ 10.30 షో కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికి షెడ్యూల్ చేశారు. ఆడియన్స్ లేకపోతే అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. 'కన్నప్ప' రిలీజ్‌కు ముందు డేంజర్ అలారమ్ మోగిందనుకోవాలి. ఆ సినిమాకు ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత టీంపై ఉంది. ముఖ్యంగా విష్ణు మీద.

Also Read'కితకితలు' హీరోయిన్ రీ ఎంట్రీ: 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు'లో గీతా సింగ్... పూజతో మొదలైన సినిమా