ఇంట్లో అబ్బాయి పెళ్లి జరిగినప్పటికీ... ఇల్లంతా సందడి సందడిగా హడావిడిగా ఉన్నప్పటికీ... సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పడానికి వచ్చి వ్యక్తి పట్ల తనకు ఎంత గౌరవం, ప్రేమ ఉన్నాయనేది చాటి చెప్పారు కింగ్ అక్కినేని నాగార్జున.
అఖిల్ పెళ్లి జరిగిన కొన్ని గంటల్లో...'కుబేర' డబ్బింగ్ థియేటర్‌లో నాగర్జున!అక్కినేని నాగార్జున రెండో కుమారుడు, యంగ్ హీరో అఖిల్ వివాహం జూన్ 6వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగింది. జూన్ 7వ తేదీ (శనివారం ఉదయం) నాగార్జున ఎక్కడ ఉన్నారో తెలుసా? అన్నపూర్ణ స్టూడియోలోని కుబేర సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతున్న థియేటర్‌లో!
శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా, నాగర్జున ఒక ప్రత్యేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కుబేర'. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో హీరోయిన్. జూన్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు రెండు వారాల సమయం ముందే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశారు నాగార్జున. ఒక వైపు ఇంట్లో పెళ్లి పనులు ఆ హడావిడి ఉన్నప్పటికీ మరో వైపు సినిమా పనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.
Also Read: 'కితకితలు' హీరోయిన్ రీ ఎంట్రీ: 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు'లో గీతా సింగ్... పూజతో మొదలైన సినిమా
ఆదివారం అన్నపూర్ణలో రిసెప్షన్!అఖిల్ వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరు అయ్యారు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ హీరో శర్వానంద్, రాజమౌళి తనయుడు కార్తికేయ, క్రికెటర్ తిలక్ వర్మ సహా అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ సందడి చేశారు.
జూన్ 8వ తేదీ (ఆదివారం) అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోలు, పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలిసింది.